రంగారెడ్డి జిల్లా నార్సింగి లో విషాదం జరిగింది.. ప్రమాదవశాత్తు ఆరేళ్ల బాలుడు బన్నీ బావి లో పడి మృతి చెందాడు. మంగళవాం సాయంత్రం కిరాణా కొట్టుకు వెళ్లిన బన్నీ, రాత్రి ఎంతకీ తిరిగి రాకపోవడంతో తో తల్లిదండ్రులు నార్సింగీ పోలీసులను ఆశ్రయించారు. పొలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహం గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీళ్లు తోడేసి బాలుడి మృతదేహాన్ని బయటకు తీసారు.