A place where you need to follow for what happening in world cup

రూ.10 లక్షలతో పార్కు ప్రహరీ పనులు ప్రారంభం

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 23వ డివిజన్ లో గల రెడ్డీస్ కాలనీలో పార్కు ప్రహరీగోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రహరీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాసాల వెంకటేష్ గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మహేష్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాము, రామకృష్ణ, రామానంద, మస్తాన్, చంద్రమౌళి, సుధీర్, శ్రీనివాస్ రెడ్డి, సీసీఎంబీ కాలనీ అధ్యక్షుడు రవీంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు పోతుల మల్లేష్, రాఘవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.