A place where you need to follow for what happening in world cup

నిజామాబాద్ బొడ్డెమ్మ చెరువు బీగాల గణేష్ గుప్తాకు ఏటీఎంల తయారైంది

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ ఫైర్
నిజామాబాద్:ఈరోజు నిజాంబాద్ నగరంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ  నిజాంబాద్ కు రేపు కేటీఆర్ వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం..?ఐదు సంవత్సరాల క్రితం నిజాంబాద్ వచ్చినా కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు ఐటి హబ్  కు  భూమి పూజ చేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సంవత్సరంలోపు పూర్తయింది. ఐటీ హబ్ 18  నెలలు పూర్తి చేస్తా అన్నావ్. ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రారంభిస్తున్నావు. అదే రోజు నాగారంలోని డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల పరిశీలనకు వచ్చిన మీరు ఇప్పటివరకు ఐదుగురికి కూడా ఇవ్వలేకపోయారు.  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ను మాత్రం సంవత్సరంలో పూర్తి చేసుకున్నారు. పేదల గూడు మీద మీకు శ్రద్ధ లేదు నిజామాబాద్ నగరం లో ఏక్కడి వేసిన గొంగడి అక్కడే ఉంది.

డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రజలు ఇబ్బంది పడుతున్న స్థానిక ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఫోటోలకు ఫోజులిచ్చి మామా అనిపించారు, తప్ప ఒక్క సమస్యను కూడా ఇప్పటివరకు పరిష్కరించలేదు. మైనార్టీ డివిజన్లో మోకాలు ఎత్తు నీరు ఉంటున్న వారి సమస్యల తీర్చే నాయకుడు కరువయ్యారూ అన్ని సమస్యలు ఉన్న నిజాంబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటనకు నీవు ఎందుకు వస్తున్నారని అన్నారు. హైదరాబాద్ కన్నా నిజాంబాద్ రోడ్ల పరిస్థితి దారుణం ఐటీ మంత్రి కేటీఆర్ రేపు మిమ్మల్ని మీ ఎమ్మెల్యే ఆహ్వానిస్తున్నారు కదా నాయకులనేవారు ప్రజలతో ఉండాలి ప్రజలతో తిరగాలి మీ ఎమ్మెల్యే మీ నాయకులు చెప్పిన మాటలు వినకండి ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మాకు అవకాశం ఇవ్వండి రేపు మేము మిమ్మల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం వారి యొక్క సమస్యలను వినండి మిమ్మల్ని మీ ఎమ్మెల్యే బీగాల పక్కదారి పట్టిస్తున్నాడు. మీ నాయకులు బిజెపి నాయకుల పైన దాడులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇది వారి అహంకారానికి నిదర్శనం. బ్రతికున్నప్పుడు పేదోడికి గూడు కోసం ఆలోచన చేయకుండా చనిపోయాక వైకుంఠధామాల పేరు మీద స్వర్గం చూపిస్తున్న ఎమ్మెల్యేకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం. మొన్న జాబ్ మేళాలో పదివేల మందిని పిలిచి కేవలం 250 మందికి మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. వారికి నువ్వు కేవలం 20 వేల రూపాయలు మాత్రం ఇస్తానని చెప్పడం జరిగింది. మొత్తం ఐటీ హబ్ లో మొత్తం 750 ఉద్యోగాలు ఇవ్వచ్చు కానీ నువ్వు దానికి రెట్టింపు ఇస్తానని చెప్పి యువతను మోసం చేశావు .నువ్వు తెస్తా అని చెప్పిన మల్టీ నేషనల్ కంపెనీ ఎక్కడికిపోయినాయి. ఇప్పుడు వస్తున్న కంపెనీ లు అది పరిశీలించి చూస్తే ఇండియాలో వాటికి గుర్తింపు కూడా లేదని అన్నారు.

అటువంటి కంపెనీలు తీసుకువచ్చి ఎమ్మెల్యే బీగాల బ్రదర్స్ నిజాంబాద్ లోని యువతను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలు సమీపిస్తుండగా ఇది ఒక స్టంట్ గా చిత్రీకరిస్తున్నారు. ఒకవేళ ఆ కంపెనీలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి  ఎన్నికల వరకు మాత్రమేనా అనే సందేహం ఉంది యువత యొక్క జీవితాల తో చలగాటం ఆడ వద్దు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ లీకేజీ ద్వారా అనేకమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు నిజామాబాద్ బొడ్డెమ్మ చెరువు  బీగాలకు ఏటీఎంల తయారైందని అన్నారు.  నాలుగు కోట్లతో ప్రారంభమైన బొడ్డెమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ 25 కోట్లు అయినా కూడా ఇప్పటికీ పూర్తికాలేదు మళ్లీ దాన్ని ప్రారంభోత్సవం పేరిట హడావిడి చేస్తున్న ఎమ్మెల్యే ఐటి హబ్ నిర్మాణ కార్మికులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలనీ కోరుతున్నాం ఇంటర్ పిల్లలను ఇంటర్వ్యూకి పిలిచి మీ సంఖ్యా కోసమేనా లేక వారికి ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా .250 మందిని ఎంపిక చేసిన మీరు మిగతా వచ్చిన వారందరికీ ఏం సమాధానం చెప్తారు వారికి ఏమైనా నిరుద్యోగ భృతి ఇస్తున్నారా   ఈ అన్ని నిర్మాణాల్లో కూడా అవినీతే మీ అవినీతిని రాబోయే రోజుల్లో బరాబర్ బయట పెడతాం. మీ నాయన వచ్చి 100 కోట్లు ప్రకటించాడు దానికి ఇప్పటివరకు అతిలేదు గతి లేదు ఇప్పటి కైనా కేటీఆర్ గారు నిజామాబాద్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతాము అని హెచ్చరిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిటి స్రవంతి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, అసెంబ్లీ కన్వీనర్ పంచ రెడ్డి లింగం జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ అసెంబ్లీ కో-కన్వీనర్ నారాయణ యాదవ్ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్ సుక్క మధు ఇప్పకాయల కిషోర్ బూర్గుల వినోద్ ఇల్లందుల ప్రభాకర్ మోర్చా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్, కైసర్, బిజెపి నాయకులు బద్దంకిషన్ బట్టి గారి ఆనంద్ ,హరీష్ రెడ్డి, మట్టం పవన్, కుమార్, ఆశిష్, భాస్కర్ రెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.