గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గంగాపూర్ నుండి జగిత్యాల కు నూతన బస్సు సర్వీసును ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఈసందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చును అన్నారు. ఆయన గ్రామ మహిళాలకు ఉచిత టికెట్లను అందజేశారు.

నూతన బస్సు సర్వీసు సౌకర్యంతో గంగాపూర్ నుండి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ప్రజల ఇబ్బందులు తొలగిన్నాయి.అని వివరించారు.ఎమ్మెల్యే కి గంగాపూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.