A place where you need to follow for what happening in world cup

భాజపాకి వోటు అడిగే హక్కు లేదు

  • వ్యతిరేకించాన వారిపై ఈడీ, సీబీఐ దాడులు
  • చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి
  • రేపు దీక్షకు దిగనున్న మంత్రి  పొన్నం ప్రభాకర్‌
‌రాష్ట్రంలో భాజపాకి వోటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చిందా అని పొన్నం నిలదీశారు. శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన వి•డియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భాజపాను వ్యతిరేకిస్తే.. ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చేనేతలకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని విమర్శించారు. భాజపా, భారాస కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హావి•ని అమలు చేస్తామని పొన్నం పునరుద్ఘాటించారు. ఇదిలా వుంటే  బీజేపీ, బీఆర్‌ఎస్‌  ‌వైఫల్యాలపై పొన్నం రేపు ఏప్రిల్‌ 14‌న దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కరీంనగర్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యాలయంలో ఆయన దీక్షకు దిగనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం వి•డియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇచ్చిన వాళ్ళనే బీఆర్‌ఎస్‌ ‌వోట్లు అడగాలని అన్నారు. తమకు ఒక్క వేలు చూపిస్తే..తాము నాలుగు వేళ్ళు చూపెడుతామని అన్నారు. పదేండ్లు మంత్రిగా ఉన్న హరీష్‌ ‌రావు బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడడంపై మోదీ అవహేళన చేశారని..అమరులను లవమానించారని, రాష్ట్రంలో వోట్లు అడగడానికి మోదీకి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ చేసిందేంటని, కొత్త రాష్ట్రానికి పదేండ్లలో బీజేపీ ఇచ్చిందేంటని, దేశాన్ని అదాని, అంబానీకి అమ్మడం తప్పా మోదీ ఏం చేశారంటూ పొన్నం మండిపడ్డారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. రాముడి ఫోటో పక్కన మోదీ ఫోటో ఎలా పెడుతారని ఆయన ప్రశ్నించారు.
అభివృద్ధి ఏం చేశారని అడిగితే అది పక్కన పెట్టి గాలి కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం తప్పన్నారు. సికింద్రాబాద్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఏం చేశారని నిలదీశారు. చేనేత కార్మికులకు బీజేపీ అన్యాయం చేసిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు నార్త్ ఇం‌డియాలో ఎలా ఆదుకుంటున్నారో సౌత్‌ ఇం‌డియాలో కూడా అలాగే ఆదుకోవాలని పొన్నం డిమాండ్‌ ‌చేశారు. మిషన్‌ ‌కాకతీయ నీళ్ళు మొత్తం ఎటు పోయాయని, తాము తాగినమా, వారు తాగారా?‘ అంటూ ప్రశ్నలు సంధించారు. గుర్తింపు కోసమే కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ ‌మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.