A place where you need to follow for what happening in world cup

దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ
కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ

న్యూ దిల్లీ, జూలై 22 : సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రియాంక, ఖర్గేలతో సమావేశం అయ్యారు. నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడంతోపాటు.. రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్‌ సెషన్‌లో ఉండబోయే కీలక అంశాలను వివరించే చాన్స్‌ ఉంది. అలాగే ఈ నెలాఖరులో వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సభకు రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినందున..దిల్లీ పర్యటనలో రాహుల్‌ను కలిసి ఆహ్వానించనున్నట్లు తెలిసింది.

అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ కొత్త చీఫ్‌ నియామకం, కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై చర్చించనున్నారు. దిల్లీ పర్యటనలో పొలిటికల్‌ అంశాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.