A place where you need to follow for what happening in world cup

మెదక్‌లోనూ బీఆర్‌ఎస్‌కు నిరాశ.. రెండో స్థానంలోకి వెంకట్రామిరెడ్డి

అనూహ్యంగా తొలిస్థానంలోకి దూసుకొచ్చిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
ట్రెండ్స్ మొదలయ్యాక చాలాసేపటి వరకు ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
మూడోస్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్

చూస్తుంటే ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీఆర్ఎస్‌కు చేదు ఫలితాలనే మిగిల్చేలా ఉంది. ఆశలు పెట్టుకున్న మెదక్ స్థానం కూడా చేజారేలా కనిపిస్తోంది. ట్రెండ్స్ మొదలయ్యాక తొలి నుంచీ ఆధిక్యంలో కొనసాగిన ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం రెండోస్థానంలోకి దూసుకెళ్లారు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫస్ట్ ప్లేస్‌కు దూసుకురాగా, కాంగ్రెస్ అభ్యర్థి మూడోస్థానంలోకి వెళ్లారు.

ఇక, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.

Lok Sabha Election Results, Telangana, Medak, BRS, BJP, Congress, Venkatrami Reddy

Leave A Reply

Your email address will not be published.