A place where you need to follow for what happening in world cup

నాలుగన్నరేళ్లలో శంకుస్థాపనలే తప్ప ఒక్క ప్రారంభోత్సవం చేసారా?

విశాఖపట్నం ఆగష్టు 2:ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (టీడీపీ నేత గంటా శ్రీనివాస్‌ రావు ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నాలుగన్నరేళ్లలో శంకుస్థాపనలే తప్ప ఒక్క ప్రారంభోత్సవం కూడా జరగలేదని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక అప్పులు ఎక్కువయ్యాయని.. ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీలు తాకట్టు పెట్టని మంగళవారం ఒకటి కూడా లేదన్నారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క చిన్న ప్రాజెక్టు అయిన పూర్తి చేసి ప్రారంభించామని ప్రజలకు చెప్పగలరా జగన్‌ అంటూ గంటా ప్రశ్నించారు.గంటా ట్వీట్ ఇదే… ‘‘ఎప్పుడూ శంకుస్థాపనలే కానీ ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క ప్రారంభోత్సవమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ నాలుగున్నారేళ్లలో కొత్తగా వచ్చిన కంపెనీ ఒక్కటీ లేదు. ఒప్పందం చేసుకున్న కంపెనీలు రివర్స్ పాలనతో పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి పోయాయ్. ఇక ఉద్యోగాలేమొస్తాయ్. ఆదాయం ఏం వస్తుంది.

అయినా ఏముందిలే అప్పులు చేసి బ్రతికేయగలరు కదా…!. మీరు ముఖ్యమంత్రి అయ్యాక అప్పు చెయ్యని నెల.. ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీలు తాకట్టు పెట్టని మంగళవారం ఒకటి కూడా లేదు కదా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో చివరి సంవత్సరంలో హడావుడిగా నిన్న విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్థాపన దగ్గర నుంచి చూస్తే… ఈ సంవత్సరం మే 3న భోగాపురం విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన.. ఇదే సంవత్సరం మే 22న మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన… ఇదే సంవత్సరం ఫిబ్రవరి 15న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..

గత సంవత్సరం జులై 20న రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన…. ఇలా ప్రతి కార్యక్రమం కూడా శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన వాటికి మీరు మళ్ళీ రెండో సారి శంకుస్థాపన పేరుతో హడావుడి చేసి ఆ రోజు తెచ్చిన పలుగు, పార, తట్ట కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజుకి మీరు శంకుస్థాపన చేసిన ఏ ఒక్క చోటు కూడా ఒక్క చిన్న ఇటుక కూడా వెయ్యలేదు మ‌డ‌మ తిప్ప‌డం మాట త‌ప్ప‌డం మా ఇంటావంటా లేద‌ని విశ్వ‌స‌నీయ‌త అనే పదానికి నేను “పేటెంట్” అని చెప్పుకుని తిరుగుతున్నారు కదా. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి కానీ దైర్యం కానీ ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క చిన్న ప్రాజెక్టు అయిన పూర్తి చేసి ప్రారంభించామని మీరు కానీ మీ నాయకులు కానీ నిర్భయంగా ఆధారాలతో ప్రజలకు చూపించగలరా…?’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.