- అభివృద్ధిని అడ్డుకునే వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరిక
- ఎల్.బి.నగర్ బైరామల్ గూడ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి
2050 లక్ష్యంతో హైదరాబాదు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాదులో మెట్రో తెచ్చింది.. కాంగ్రెస్ ప్రభుత్వమని.. విస్తరించేది కూడా కాంగ్రెస్ సర్కారే అన్నారు. ఎల్. బి నగర్ సాగర్ రింగ్ రోడ్డులోని బైరామల్ గూడ లోని ఆలేఖ్య టవర్స్ వద్ద రూ.178 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కై ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శోభన్ రెడ్డి తో కలిసి ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2018 లో కొడంగల్ లో ఓడిపోతే.. మల్కాజ్గిరి లో ఎంపీగా గెలిపించారని గుర్తు చేసుకున్నారు. కేవలం ఎల్బీనగర్ నియోజకవర్గం లో సుమారు 30 వేలకు పైచిలుకు.. మెజార్టీతో ఎంపీగా గెలిపించారన్నారు. మీ ఆశీర్వాదం, అండదండలతో ప్రశ్నించే గొంతు క గా పిసిసి అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగినట్లు గుర్తు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడే వారిని బహిష్కరించాలని హెచ్చరించారు. 50 వేల కోట్లతో మూసిని సుందరీకరణ చేస్తామని సీఎం చెప్పారు. హైదరాబాదును అభివృద్ధి పథంలో తీసుకుపోయే విధంగా.. పెరిగిన జనాభా కనుగుణంగా కృష్ణ గోదావరి జలాలతో పాటు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ కూడా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్ చంద్రయన్గుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడిరచారు. మెట్రో రైల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అంకురార్పణ చేసిందని… ఫేస్ టూ కూడా ఉప్పల్, ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన గుట్ట, మహిళాదేవరపల్లి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం కు అనుసంధానంగా నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి, విస్తరణను అడుక్కోవడానికి కేంద్రం ఉసిగొల్ప డం మంచి పరిణామం కాదని.. ఇలాంటి వారిని నగర బహిష్కరణ చేస్తామని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. పలువురు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎల్బీనగర్ ఇంచార్జ్ జక్కడి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు,కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.