A place where you need to follow for what happening in world cup

భారత్-అమెరికాల మధ్య గేమ్ ఛేంజర్

భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడింది. చారిత్రక రక్షణ సహకార ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఒకే చెప్పింది. దీంతో భారత వైమానికి దళం కోసం సంయుక్తంగా జెట్ ఇంజిన్లను తయారు చేసే ఒప్పందానికి మార్గం సుగమం అయింది. ఇది రెండు దేశాల రక్షణ సహకారాని పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. F414 ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేయడానికి GE ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మధ్య జరిగిన ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది.ఈ ఏడాది జూన్ నెలలో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన క్రమంలో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఈ ఒప్పందాన్ని ఆమోదించడం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కి పెద్ద విజయం. భారతదేశ కంపెనీ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒప్పందం సుగమం అయింది.

ఈ ఒప్పందంలో సంయుక్తంగా జెట్ ఇంజన్లు తయారీ చేయడంతో పాటు సాంకేతిక బదిలీ, లైసెన్సింగ్ ఏర్పాటు ఉన్నాయి. ఈ ఒప్పందంలో 99 జెట్ ఇంజన్ల సంయుక్త ఉత్పత్తి కూడా ఉంది.భారత రక్షణ రంగ నిపుణులు ఈ ఒప్పందాన్ని గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు. దీని వల్ల జీఈ ఏరోస్పేస్ తన 80 శాతం టెక్నాలజీని F414 ఫైటర్ జెట్ ఇంజిన్‌ల ఉత్పత్తి కోసం భారతదేశానికి బదిలీ చేస్తుంది. దీని వల్ల స్వదేశీ తయారీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(LCA) MKII పనితీరు మరింత మెరుగుపడుతుంది.హెచ్ఏఎల్ చీఫ్ సీబీ అంతన కృష్ణన్ మాట్లాడుతూ.. ఇది చాలా కీలక ఒప్పందం అని అన్నారు.

దీని వల్ల రానున్న కాలంలో భారత వైమానిక శక్తికి ఊతమనిచ్చే స్వదేశీ ఇంజన్లు తక్కువ ఖర్చుతో తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది.భారత రక్షణ రంగ నిపుణులు ఈ ఒప్పందాన్ని గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు. దీని వల్ల జీఈ ఏరోస్పేస్ తన 80 శాతం టెక్నాలజీని F414 ఫైటర్ జెట్ ఇంజిన్‌ల ఉత్పత్తి కోసం భారతదేశానికి బదిలీ చేస్తుంది. దీని వల్ల స్వదేశీ తయారీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(LCA) MKII పనితీరు మరింత మెరుగుపడుతుంది.హెచ్ఏఎల్ చీఫ్ సీబీ అంతన కృష్ణన్ మాట్లాడుతూ.. ఇది చాలా కీలక ఒప్పందం అని అన్నారు. దీని వల్ల రానున్న కాలంలో భారత వైమానిక శక్తికి ఊతమనిచ్చే స్వదేశీ ఇంజన్లు తక్కువ ఖర్చుతో తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది.

Leave A Reply

Your email address will not be published.