మోత్కూర్ మునిసిపల్ పరిధిలోని వై జే పంక్షన్ హాల్ సమీపంలో శనివారం కారు అదుపు తప్పి బోల్తా పడడంతో గుండాల మండలం గంగాపురం గ్రామానికి చెందిన విష్ణు కుటుంబానికి చెందిన నలుగురుకి గాయలయ్యాయి.
గాయపడిన వారిని 108 వాహనంలో జనగామ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.విరంతా మహా శివరాత్రి సందర్బంగా నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ జడల రామాలింగేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని 108 ఈ ఏంటి తొంట భాస్కర్,పైలెట్ శంకర్ తెలిపారు.