A place where you need to follow for what happening in world cup

భద్రాచలంకు ఎగువన ప్రాజెక్టుల వద్ద ప్రస్తుత డిశ్చార్జ్ స్థితి.

Current discharge status at projects upstream of Bhadrachalam.

  • శ్రీరాంసాగర్ 2,58,000 క్యూసెక్కులు..
  • ఎల్లంపల్లి 9,11,000 క్యూసెక్కులు..
  • మేడిగడ్డ 13,17,000 క్యూసెక్కులు..

భద్రాచలం: గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో.. మొన్న రాత్రి నుండి నిన్న ఉదయం వరకు…తెలంగాణ చరిత్రలో కని విని ఎరుగని వర్షాలు పడడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది… దీనితో అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగుకు విడుదల చేస్తున్నారు.గురువారం రాత్రి నుండి భద్రాచలంకు ఎగువన ఉన్న కాళేశ్వరం.. పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. ఈ వరద నీటితో భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం ఈ రాత్రికి 55 నుండి 60 అడుగుల మధ్య చేరుకునే అవకాశం ఉంది. గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాల్లో, శుక్రవారం మధ్యాహ్నం నుండి వర్షం తగ్గడం.. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం కొంచెం ఉపశమనం కలిగిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.