A place where you need to follow for what happening in world cup

గజ్వేలు నుంచి సీఎం ఓటమి

ఉమ్మడి మెదక్ జిల్లా  నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఏనాడూ ఆయన నియోజకవర్గం గజ్వేల్ ప్రజలకు  ముఖం చూపించలేదని బీజేపీ నేతల ఈటల రాజేందర్ విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లా పది నియోజకవర్గాలపై సంగారెడ్డిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.   ఓట్ల వేసిన పాపానికి మా ఎమ్మెల్యేను చూశాం అనే తృప్తి లేదు అని వారు బాధ పడుతున్నారన్నారు.  ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నటు.. మీరు సీఎం కావాలంటే ఓట్లు వేసి పంపించింది గజ్వేల్ వారు. కానీ వారి భూములు అన్నీ లాక్కున్నారు. పేదవాల్లకు ఇచ్చిన అసైన్డ్ భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టారని విమర్శించారు. కెసిఆర్ దళిత పేదలకు మూడు ఎకరాలు ఇస్తా అని ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు కానీ.. ఎప్పుడో మాకు ఇచ్చిన కోట్ల రూపాయల భూములను లాక్కున్నారు అని ప్రజలు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశరు.  గజ్వేల్ లో  కెసిఆర్ ను ఎట్టిపరిస్థితుల్లో గెలిపించవద్దు అని వారు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

అక్కడో ఇక్కడో ఎందుకు గజ్వేల్ లో పోటీ చేస్తా అని ఛాలెంజ్  చేశానన్నారు. ఏ సర్వే సంస్థ వెళ్ళినా ఈ సారి కెసిఆర్ కి ఓటు వేయం అని చెప్తున్నారన్నారు.  ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు అసలు వ్యతిరేకత ఉంది  కేసీఆర్ మీదేనన్నారు.  అన్నీ సీట్లు ఒకేసారి ప్రకటించడం కెసిఆర్ బలం కాదు బలహీనత అని..  మా ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారు అని స్వయంగా కెసిఆర్ చెప్పారన ిగుర్తు చేశారు. 40 శాతం టికెట్ల మారతాయి అని ఆయనే చెప్పారు. కానీ ఒక వేళ టికెట్ మారిస్తే వేరే పార్టీకి పోతారు అనే భయంతో ఇచ్చారన్నారు.  కట్టు తప్పింది, పట్టు తప్పింది అనే భయంతో ప్రకటించారు.

చాలా మంది ప్రజల చేత తిరస్కరించిన వారికి టికెట్స్ ఇచ్చారు. వారు గెలిచేది లేదని స్పష్టం చేశారు.
” ఉపాసం ఉండి అటుకులు బుక్కి పార్టీనీ నడిపిన”  అని చెప్పిన కెసిఆర్ కి అతి తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని ఈటల ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన  డబ్బు,  మద్యంతో గెలవాలని చూస్తున్నారని.. దశాబ్ది ఉత్సవాల కోసం 200 కోట్లు ఖర్చుపెట్టారన్నారు.   అవన్నీ ప్రజల పైసలు. ఎవడబ్బ సొమ్మని వాటితో దావత్ ఇచ్చారని ప్రశఅనించారు. కెసిఆర్ ఆ నిమిషానికి గట్టెక్కడనికి ఇచ్చే హామీలే తప్ప అవి అమలవుతాయనే సోయి లేదు. డబుల్ బెడ్ రూం ఇయ్యలే, 57 సంవత్సరాల పెన్షన్ ఇయ్యల్,  నిరుద్యోగ భృతి ఇయ్యలే, రుణమాఫీ డబ్బులు వడ్డీకి సరిపోవట్లే, హామీలు బోలెడు అమలు శూన్యమని ఎద్దేవా చేశారు.  జీతాలు సరిగ్గా ఇవ్వలేక పోతున్న మీరు ఎలా హామీలు తీర్చగలుగుతారని ప్రశఅనించారు.  సర్పంచ్ లు, కాంట్రాక్టర్స్ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నాని గుర్తు చేశారు.  ఆర్థిక వ్యవస్థ అదోగతిపాలయింది.

కెసిఆర్ మాటలకు మోసపోతే గొసపడతమని ప్రజలకు సూచించారు.  కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు ఉంటే కుక్కల లెక్క మోరుగుతారు అని తీసుకువచ్చి మన దాంట్లో పడేసినం, పిల్లుల్ల చేసినం అన్నారు. ఆ ఎమ్మెల్యే లు ఎలా కనపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్య్సీ అంటన్నారని..   ఇంత అవమానమా ? లఅని ప్రశ్నించారు.  ఇంకో ఎమ్మెల్యే అంటారు.. కాంగ్రెస్ వారిని ఏమీ అనకండి BRS పార్టీనే కొంత మందినీ కాంగ్రెస్ లోకి పంపించాం, మనమే డబ్బులు ఇస్తాం, మనమే గెలిపిస్తాం.. మళ్లీ అవసరం అయినప్పుడు వారిని తీసుకుంటాం అని చెప్తుంటే వారిని ఏమనాల్నారు.  తెలంగాణ ప్రజలారా ఇది చిన్న విషయం కాదు విజ్ఞతతో ఆలోచన చేయాలని సూచించారు.  BRS కు ఓటు వేస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది. మన కుటుంబాలు బాగుపడాలి అంటే బీజేపీకి ఓటు వేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.