రజత్ శర్మ అదాలత్‌లో సిఎం రేవంత్ వ్యాఖ్యలు
తాను పిల్లులను, కుక్కలను చంపనని, చంపితే సింహాన్నే చంపుతానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా టివిలో నిర్వహించే ఫేమస్ టాక్ షో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం దిల్లీకి వెళ్లిన ఆయన ఈ కార్యక్రమంలో పలు విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సిఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కెసిఆర్ సర్కారు ఆయనను జైలులో వేసినందుకు రివేంజ్ తీసుకుంటున్నారా అని ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో యాంకర్ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు సిఎం రేవంత్ బదులిస్తూ రివేంజ్ ఇంకా స్టార్టే కాలేదని సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహం లోపల ఉందని బిఆర్‌ఎస్ నేతలు తరచూ అంటున్నారని, బయటకు వొస్తుంది అప్పుడు చూడండి అంటున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా, రమ్మనండి పిస్టోల్‌తో రెడీగా ఉన్నాం, ఒక్క తూటాతో అయిపోతుందని సిఎం రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.