కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ప్రకటించే ఛాన్స్
గెలుపు గుర్రాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు ఏఐసీసీ కసరత్తు
న్యూ దిల్లీ, మార్చి 6 : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దిల్లీకి వెళ్లనున్నారు. గురువారం ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అభ్యర్థుల ఎంపిక బాధ్యత రేవంత్‌కు అధిష్ఠానం అప్పజెప్పింది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ హై కమాండ్‌కు వివరించనున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను ఏఐసీసీ నేడు ప్రకటించనుంది. మహబూబ్‌నగర్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును ఇప్పటికే సిఎం రేవంత్ ప్రకటించారు. మిగతా సీట్లపై మాత్రం హైకమాండ్ ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ నుంచి బరిలోకి దిగాల్సిందిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు కోరారు. కేరళలోని వాయనాడ్‌లో సిపిఐ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో, తెలంగాణ నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే నాగర్ కర్నూలు నుంచి తన పోటీ ఖాయమని మరో కాంగ్రెస్ నేత మల్లు రవి ప్రకటించారు. తనకు కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయం కూడా నేటి జాబితా ప్రకటనతో తేలిపోనుంది.