తెలుగు దేశం పార్టి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించడం అన్యాయమని ఏలూరు జిల్లా తెలుగు దేశం పార్టి కార్యవర్గం ఆరోపించింది. ఏలూరు జిల్లా టి డి పి కార్యాలయం లో మంగళ వారం రాష్ట్ర టి డి పి నాయకత్వం పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై జిల్లా పార్టీ నాయ కత్వం అవలంబించాల్సిన తక్షణ భవిష్యత్ కార్యా చరణ కార్యక్రమాల పై ఏలూరు పార్ల మెంట్ టి డి పి ఇన్ ఛార్జ్ గ న్నీ వీరాంజ నీయులు అధ్యక్షతన జిల్లా టి డి పి కార్య వర్గం చర్చించింది.
ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి గని వీరాంజనేయులు, మాజీమంత్రి కేఎస్ జవహర్, ఏలూరు నియోజవర్గ టిడిపి ఇన్చార్జి రాధాకృష్ణ లు మాట్లాడుతూ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించారని దీని ప్రజలంతా గమనిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు చంద్ర బాబు నాయుడు పై అధికార పార్టీ అవలంబిస్తున్న కక్ష సాధింపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని నాయకులు పిలుపునిచ్చారు రాష్ట్రంలోని కార్యకర్తలంతా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులను ప్రజలకు వివరించి మద్దతు తెలియజేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా నలుమూలల గ్రామాలనుంది టి డి పి నాయకులు.కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్య క్రమం లో పాల్గొన్నారు.