A place where you need to follow for what happening in world cup

రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌
నల్లగొండ …కుందూరు రఘువీర్‌
మహబూబాబాద్‌ … బలరాం నాయక్‌
మహబూబ్‌నగర్‌ …చల్లా వంశీచంద్‌ రెడ్డి
దేశ వ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల
వయనాడ్‌ నుంచే మరోమారు రాహుల్‌ పోటీ

కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ప్రకటించిన 36 మందితో కూడిన జాబితాలు శుక్రవారం ప్రకటించగా అందులో తెలంగాణ నుంచి నలుగురు స్థానం దక్కించుకున్నారు. గురువారం దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, జై రామ్‌ రమేష్‌ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో కాంగ్రెస్‌ సీఈసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో తెలంగాణ నుంచి పోటీ చేసే లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. నియోజకవర్గాల వారీ బలాబలాలు, సామాజిక సవిూకరణల ప్రకారం అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు.
image.png
పదిమంది పేర్లతో తొలి జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కాగా తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్‌ స్థానాలకుగానూ తొలి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి చల్లా వంశీచంద్‌ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. . జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్‌, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌,  పేర్లు జాబితాలో చోటుచేసుకున్నాయి. కాగా ఇప్పటి వరకు సికింద్రాబాద్‌, పెద్దపల్లి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి స్థానాలపై మాత్రమే ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.
image.png
దేశ వ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల…వయనాడ్‌ నుంచే మరోమారు రాహుల్‌ పోటీ దేశ వ్యాప్తంగా 36 మంది లోక్‌సభ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించింది. ఇందులో ప్రధానంగా రాహుల్‌ గాంధీ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌ నుంచి మరోమారు పోటీ చేస్తారు. తొలిజాబితాలో ఆయన పేరును ప్రకటించారు. అలాగే తిరువనంతపురం నుంచి శశిథరూర్‌ మరోమారు పోటీ చేయనున్నారు. ఇకపోతే ఛత్తీస్‌ఘడ్‌ మాజీ సిఎం భూపేశభగేల్‌ ఎంపిగా పోటీచేయబోతున్నారు. తాజా జాబితాలో కర్నాటక, కేరళలోనే అత్యధిక స్థానాలను ప్రకటించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్‌రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు గడువు సవిూపిస్తున్న తరుణంలో ఏఐసీసీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. దిల్లీలో టీపీసీసీ నేతలతో కాంగ్రెస్‌ సీఈసీ సమావేశం అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.