A place where you need to follow for what happening in world cup

మా పథకాలు అమలు చేయకుండా చతికిల

  • ఉద్యమం చేసి సాధించిన తెలంగాణను కాపాడాం
  • అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకుని వెళ్లాం
  • నాగర్‌కర్నూలు ప్రచారంలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌నిలదీశారు. కొత్తగా గడ్డపార పట్టి తవ్వాల్సిన అవసరం లేదు కదా..అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో అమలైన పథకాలను అమలు చేయొచ్చు కదా..అని అడిగారు. నాగర్‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రోడ్‌ ‌షోలో కేసీఆర్‌ ‌పాల్గొని ప్రసంగిస్తూ…ఇవాళ గొప్పదినం. తెలంగాణ పార్టీ పుట్టిన దినం. 23 ఏండ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో, గుండె ధైర్యం తెచ్చుకుని ఏపీ నుంచి బయటపడాలని ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించాం. పెరిగాం. మహాసముద్రం అయ్యాం. ఉప్పెనలా ఉద్యమం నడిపాం. ఆ క్రమంలో చాలా సార్లు నాగర్‌కర్నూల్‌ ‌వచ్చాను. పార్టీకి 14 ఏండ్లు పూర్తయ్యే సమయంలో ఆమరణ దీక్షకు పూనుకుని కేసీఆర్‌ ‌సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో తేలాలని ఆనాడు దీక్షకు పోతే ఖమ్మం జైల్లో వేశారు. వి•రంతా ఉప్పెనలా ఉద్యమించారు. చివరకు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో పాలమూరు నా గుండెల్లో ఉంటది.

ఈ మహబూబ్‌నగర్‌ ఎం‌పీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో మహబూబ్‌నగర్‌కు ఉంటది అని కేసీఆర్‌ ‌తెలిపారు. కులం, జాతి, మతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలను సాదుకున్నట్టు పదేండ్లు గులాబీ జెండా కింద సాదుకుని, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. 50 ఏండ్లు కాంగ్రెస్‌, ‌టీడీపీ పాలన ఉంటే పాత మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు ఒక్క మెడికల్‌ ‌కాలేజైనా వొచ్చిందా..? ఇవాళ ఐదు మెడికల్‌ ‌కాలేజీలు వచ్చాయి బీఆర్‌ఎస్‌ ‌రాజ్యంలో. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ ‌రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు పిలిపించుకుని బస్సులో గద్వాలకు ప్రయాణించాను. వలసలు పోయినా పాలమూరు ఎట్లుందో చూడాలని 200 కి.వి•. బస్సులో వెళ్లాను. చాలా ఆనందం, సంతోష పడ్డాను. వరికోతలు, ధాన్యపు రాశులు చూస్తే ఆనందం కలిగింది. నా పాలమూరు ఇంత బాగైందని సంతోష పడ్డాను అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు.

మొన్న అడ్డగోలు హావి•లిచ్చి దుష్పచ్రారాలు చేసి కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతుబంధు అందరికీ వొచ్చిందా..? ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 వొచ్చాయా.? రుణమాఫీ అయిందా..? తులం బంగారం వొచ్చిందా..? అమ్మాయిలకు స్కూటీలు వొచ్చాయా..? వరికి రూ. 500 బోనస్‌ ‌వొచ్చిందా..? చివరికి వొస్తే ఎండింది ఎండంగ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పెడితే కొనే దిక్కు లేదు. వానలకు తడిసిపోతుంది తప్ప కొనే దిక్కు లేదు. ఈ ప్రభుత్వం పరిస్థితి ఇది. బీఆర్‌ఎస్‌ ‌గవర్నమెంట్‌లో ఒక్క ఏడాదిలోనే కరెంట్‌ 24 ‌గంటలు ఇచ్చాం. రెప్పపాటు కరెంట్‌ ‌పోలేదు. కాంగ్రెస్‌ ‌రాజ్యంలో కరెంట్‌ ‌పోతుంది. బావుల కాడ తేళ్లు, పాములు కడుతున్నాయి. ఇప్పటి వరకు 225 మంది రైతులు చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు కరెంట్‌ ‌షాకులతో, పాములు కరవడంతో చనిపోయారు. ఈ బాధ ఎందుకు వచ్చిందో ఆలోచన చేయండి. కేసీఆర్‌ ‌పెట్టిన పథకాలు ఇవ్వాలి కదా.. కొత్తగా గడ్డపార పెట్టి తవ్వాల్సిన అవసరం లేదు కదా..? అని కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. సీఎం, మంత్రులు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నాం అంటున్నారు. కానీ రోజుకు పది సార్లు పోతుంది. ఇవాళ శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఇం‌ట్లో అన్నం తింటుంటే కరెంట్‌ ‌పోయింది.

కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని తీసేశారా అని అడిగాను. ఒక్కసారి కాదు.. రోజుకు పదిసార్లు పోతుందని చెప్పారు. ఇది కాంగ్రెస్‌ ‌పరిపాలన.. వి•రంతా కళ్లారా చూస్తున్నారు. బ్రహ్మాండంగా మిషన్‌ ‌భగరీథతో ఇంటింటికి నీళ్లు అందించాం. ఇప్పుడు బోర్లు ఎందుకు వేస్తున్నారు..? నీళ్ల ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి.? బిందెలతో ఆడబిడ్డలు కనిపిస్తున్నారు అని కేసీఆర్‌ ‌తెలిపారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తది.. ఇందులో ఏం అనుమానం లేదు.. రంది పడాల్సిన అసవరం లేదని కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు. ఈ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బలుపును దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇవాళ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌.. ‌నీ గుడ్లు పీకి గోటీలు అడుకుంటా.

నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఆఖరికి వస్తే నీ ముడ్డి వి•ద చెడ్డి కూడా గుంజుకుంటా.. ఇది సీఎం మాట్లాడే భాషేనా..? ఇది ధర్మమేనా..? తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఇన్నేండ్లు పోరాటం చేసిన వ్యక్తిని, వచ్చిన తెలంగాణను తెల్లగా చేసిన వ్యక్తిని, మంచినీళ్లు, సాగు నీళ్లు, కరెంట్‌ ‌కోసం తండ్లాడిన వ్యక్తిని.. నన్ను ప్టటుకుని ఇన్ని మాటలు అనొచ్చానా..? ఇది ధర్మమేనా..?ఇదా మన తెలంగాణ గౌరవమా..? అని కేసీఆర్‌ ‌నిలదీశారు. వి•రే న్యాయం, ధర్మం చెప్పండి.. కర్రు కాల్చి వాత పెట్టండి.. ఎవరిని అందలం ఎక్కించాలో నిర్ణయించేది వి•రే.. ఆ శక్తి ఉన్నది వి• దగ్గర. ధర్మాన్ని గెలిపించండి.. బీఆర్‌ఎస్‌ ‌గెలిపించండి. మళ్లా మన గవర్నమెంటే వొస్తుంది.. ఇది గ్యారెంటీ. ఎక్కడ పోయినా నా బస్సును కదలనివ్వడం లేదు. కచ్చితంగా జనం మారిపోయారు.. అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి చురక పెట్టాలని, బలుపు దించాలని ప్రజలు ఉన్నారు. ఏం అనుమానం లేదు మన ప్రభుత్వమే వస్తుంది. అన్ని బ్రహ్మాండంగా చేసుకుందాం. రంది పడాల్సిన అవసరం లేదు అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కెసిఆర్‌ ‌వెంట ఎంపి అభ్యర్థి ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌మాజీమంత్రి నాగం జనార్థన్‌ ‌రెడ్డిలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.