జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కే నా మద్దతని వెల్లడించారు. రాజకీయం గా పవన్ కు తాను మద్దతిస్తున్నట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేద వాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారు.
ఇందుకోసం కుటుంబాన్ని ప్రక్కన పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ మూడు 3 పెళ్లిళ్ల పై చర్చ అపండి. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారు. నా పిల్లలనే కాదు మిగతా ఇద్దరు పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి. ఓ తల్లిగా ఇది నా అభ్యర్థన అని రేణుదేశాయ్ కోరారు…