63 శాతం పోలింగ్ నమోదు
న్యూదిల్లీ, మే 13 : దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా మొదలయ్యింది. 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో చురుకుగా కొనసాగింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు 63 శాతం పోలింగ్ నమోదైంది. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన గణాంకాల ప్రకారం, పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 75.94 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్మూ కశ్మీర్లో అత్యల్పంగా 36.58 శాతం నమోదైంది. మధ్యప్రదేశ్‌లో 68.63 శాతం, ఆంధప్రదేశ్‌లో 68.26 శాతం, తెలంగాణలో 61.23 శాతం, బీహార్‌లో 55.90, జార్కండ్లో 63.37 శాతం, ఒడిశాలో 63.85 శాతం, మహారాష్ట్రలో 52.75, ఉత్తరప్రదేశ్‌లో 57.88 శాతం పోలింగ్ నమోదైంది.
లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని 28 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం నాడు పోలింగ్ జరిగింది. కాగా, సోమవారం పోలింగ్ జరుగుతున్న మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఆంధప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌లో 8, పశ్చిమబెంగాల్లో 8, బీహార్‌లో 5, జారా?ండ్, ఒడిశాలో చెరో ఐదు, జమ్మూకశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానం ఉన్నాయి.