A place where you need to follow for what happening in world cup

డిఫరెంట్ కంటెంట్ తో రూపొందుతున్న ‘శివం భజే’

  • అశ్విన్ బాబు హీరోగా రూపొందుతున్న ‘శివం భజే’
  • కథానాయికగా సందడి చేయనున్న దిగాంగన సూర్యవన్షి 
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న అర్బాజ్ ఖాన్
  • 80 శాతం షూటింగు పూర్తిచేశామన్న మేకర్స్ 

అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ను కొంతసేపటి క్రితం ప్రకటించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై, ప్రొడక్షన్ నంబర్ 1 గా ఈ సినిమా నిర్మితమవుతోంది. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘శివం భజే’ అనే టైటిల్ ను ఖరారు చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దిగాంగనా సూర్యవన్షి కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”అశ్విన్ హీరోగా ఒక వైవిధ్యమైన కథతో మా సంస్థ మొదటి నిర్మాణంగా ‘శివం భజే’ తెరకెక్కుతోంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్స్ తో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది” అని అన్నారు.

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, ” మా కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ‘శివం భజే’ దొరకడం చాలా సంతోషంగా ఉంది. 80% షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నాం. మా హీరో అశ్విన్ బాబు, బాలివుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, తమిళ నటుడు సాయి ధీనా, హైపర్ ఆది, మా నిర్మాత మహేశ్వర రెడ్డి గారు చాలా సహకరించారు. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.