మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ చొరవ
కృతజ్ఞతలు తెలిపిన మందకృష్ణ మాదిగ
కృతజ్ఞతలు తెలిపిన మందకృష్ణ మాదిగ
మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ శనివారం భేటీ అయ్యారు. ఎన్వీ రమణ సీజేఐగా ఉన్నప్పుడు సుప్రీంలో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణ జరిగింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించి సీజేఐగా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎన్వీ రమణ పంపించారు. ఎస్సీ వర్గీకరణ కేసును సుప్రీంకోర్టులో అనుమతించినందుకు మాజీ సీజేఐను కలిసి మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించిన మంద కృష్ణ మాదిగ బృందాన్ని ఈ సందర్భంగా మాజీ సీజేఐ ఎన్వీ రమణ అభినందించారు. కాగా… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆగస్ట్ 1న సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని తెలిపింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు,ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది.
6:1తో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించారు. సుప్రీం తీర్పుపై స్పందించిన మందకృష్ణ మాదిగ దిల్లీలో డియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలు అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు.
నాటి సందర్భంలో సీఎంగా ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు నాయుడు అమలు చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయం వైపు తీర్పు చెప్పిందని.. ధర్మమే గెలిచిందన్నారు. అధర్మం తాత్కాలికంగా గెలిచినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో ఇక్కడి నుంచి వెళ్లిపోయామని అన్నారు. ఈ విజయం కోసం 30 ఏళ్లు తపనతో కూడిన పోరాటం చేసామన్నారు. ఈ 30 ఏళ్ల పోరాటంలో అమరులయిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బిడ్డలకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు.
ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయని.. కొంతమంది వెన్నుపోటు పొడిచారన్నారు. సమాజం యావత్తు మాదిగల వైపు నిలబడిందన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు తమ వైపు నిలబడ్డారన్నారు. న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం తమ వైపు నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో పెద్దలు, డియాకు కృతజ్ఞతలు తెలిపారు.
అణగారిన వర్గాల వైపు, పేద వర్గాలవైపు న్యాయం నిలబడిందన్నారు. ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
అణగారిన వర్గాల వైపు, పేద వర్గాలవైపు న్యాయం నిలబడిందన్నారు. ప్రధాన న్యాయమూర్తులతో పాటు, ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
తమకు అండగా నిలబడ్డ ప్రధాని మోదీ, అమిత్ షా, భుజాన వేసుకుని తమవైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలకు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాలన్నారు. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలని కోరారు. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని… ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని.. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.