ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్
కోరుట్ల:సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన మణిపూర్ అల్లర్ల ఘటనలో ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించేడమే కాకుండా అత్యాచారం చేసి అందులో ఇద్దరిని హత్య చేయడం దుర్మార్గపు చర్య అని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ డిమాండ్ చేశారు.
శుక్రవారం కోరుట్ల పట్టణం లోని తన కార్యాలయంలో పేట భాస్కర్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధులకై మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి ప్రక్రియలో అమాయాక గిరిజన మహిళలు బలైనారని మే 4 న జరిగిన ఈసంఘటన ఇన్ని రోజులుగా బయట ప్రపంచానికి తెలియకుండా వ్యవరించారంటే దేశంలో ఎం జరుగుతుందో అనే సందేహంలో ప్రజలు నిర్ఘంతపోయరన్నారు. అక్కడ ఇరువర్గాల మద్య జరుగుతున్న అరాచకపు అల్లర్లలో ఇంక ఎంతమంది చనిపోయరో బయటికి రావల్సివుందని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని పేట భాస్కర్ కోరారు.