- నిరాశులైన రెండు కుటుంబాలు
- తక్షణం ఆదుకున్న ఎమ్మెల్యే చిర్ల
కోనసీమ:కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం లంక గ్రామాల ముఖ్య కేంద్రమైన చెముడులంకలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటకిల్లు పూర్తిగా దగ్ధమవ్వగా ముత్తాబత్తుల వీర్రాజు, ముత్తాబత్తుల చిన్న రెండు కుటుంబాలు కట్టు బట్టలతో మిగిలి నిరాశ్యులయ్యారు. స్థానికులు మండపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు పక్క గృహాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఆస్తి నష్టం సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
మండల వైకాపా కోఆర్డినేటర్, గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ప్రమాద విషయం తెలపడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 15 వేలు, 50 కిలోల బియ్యం, నూతన వస్త్రాలు, వంట పాత్రలను తక్షణసాయంగా అందించారు. అలాగే ఆ గ్రామ సర్పంచ్ తమన శ్రీనివాసు మరో రూ 5 వేలు, 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి పలు విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తాసిల్దార్ ఐపి శెట్టి, పంచాయతీ కార్యదర్శి యు రేణుక, దొండపాటి వెంకటేశ్వరరావు (బులిరెడ్డి), మాజీ సర్పంచులు బి వీర వెంకటరావు, నాగిరెడ్డి సత్యనారాయణ, అడబాల వీర్రాజు దొండపాటి చంటి, దొండపాటి శ్రీను, తమ్మన గోపాలకృష్ణ పలువురు పాల్గొన్నారు.