- 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్
- తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసిన భారత్
- లక్ష్యఛేదనలో 8 వికెట్లకు 152 పరుగులే చేసిన ఐర్లాండ్
- సిరీస్ 2-0తో టీమిండియా కైవసం
ఐర్లాండ్ తో తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల నిలిచిపోగా, డీఎల్ఎస్ ప్రకారం నెగ్గిన భారత్… రెండో టీ20లో మాత్రం సాధికారికంగా విజయం సాధించింది. డబ్లిన్ లోని ది విలేజ్ మైదానంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆండ్రూ బాల్ బిర్నీ చేసిన 72 పరుగులకే అత్యధికం. ధాటిగా ఆడిన బాల్ బిర్నీ 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. అయితే, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (0), లోర్కాన్ టకర్ (0) డకౌట్ కాగా, కీలక ఆటగాడు హ్యారీ టెక్టర్ (7) నిరాశపరిచాడు.
కర్టిస్ కాంఫర్ 18, జార్జ్ డాక్రెల్ 13, మార్క్ అడౌర్ 23 పరుగులు చేయడంతో ఐర్లాండ్ స్కోరు 150 మార్కు చేరుకుంది. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఐర్లాండ్ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది.
టీమిండియా ఈ విజయంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.