A place where you need to follow for what happening in world cup

రియాల్టీకి దూరంగా సూపర్ స్టార్..?

చెన్నై, జూలై 31:రజినీకాంత్ రియాలిటీలోకి రాలేకపోతున్నారా..? తగ్గిన తన ఇమేజ్‌ ఒప్పుకోలేకపోతున్నారా లేదంటే పడిపోయిన మార్కెట్‌ను పట్టించుకోకుండా రెమ్యునరేషన్ విషయంలో కొండెక్కి కూర్చుంటున్నారా..? తమిళనాట రజినీకాంత్ విషయంలో ఏం జరుగుతుంది.. అక్కడి నిర్మాతలు సూపర్ స్టార్‌ను భరించలేకపోతున్నారా..? ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయిప్పుడు. మరి దానికి రీజన్ ఏంటి..? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..ఒకప్పుడు రజినీకాంత్ నుంచి సినిమా వచ్చిందంటే నిజంగానే దుమ్ము ధూళి అన్నట్లుండేది పరిస్థితి. టాక్‌తో పనిలేకుండా కలెక్షన్స్ కుంభవృష్టి కురిసేది.. టాక్ జనాల్లోకి వెళ్లేలోపు నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి వచ్చేసేది. కానీ ఇప్పుడలా లేదు.. మారిన కాలంతో పాటు ట్రేడ్ లెక్కలు.. ట్రెండ్ రెండూ మారాయి. దాంతో పాటు రజినీ ఇమేజ్‌తో పాటు మార్కెట్ కూడా పడిపోయింది. రజినీ సినిమాలకు ఒకప్పుడున్న మార్కెట్ ఇప్పుడు లేదనేది కాదనలేని వాస్తవం.

తమిళనాట ప్రస్తుతం విజయ్, అజిత్ టాప్‌లో ఉన్నారు. వాళ్ల సినిమాలకే అత్యధిక వసూళ్లు కూడా వస్తున్నాయి. కబాలి తర్వాత తమిళంలో రజినీకి హిట్ లేదు.. తెలుగులో అయితే కబాలి కూడా ఫ్లాపే. కాలా, పేట, 2.0, దర్బార్, అన్నాత్తే.. ఇలా వచ్చిన సినిమా వచ్చినట్లు చాప చుట్టేసింది.. కానీ రజినీ రెమ్యునరేషన్ మాత్రం అలాగే ఉండిపోయింది.ఇప్పటికీ ఒక్కో సినిమాకు కనీసం 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు రజినీ. తన సినిమాలకు అయ్యే బిజినెస్ కంటే ఎక్కువ పారితోషికం అడుగుతున్నారనేది రజినీపై వస్తున్న కంప్లైంట్. అప్పుడంటే మార్కెట్ భారీగా ఉండేది కానీ ఇప్పుడలా కుదరదు. బడ్జెట్‌లో 80 శాతం ఆయనకే వెళ్తుంటే.. బిజినెస్ వర్కవుట్ కావట్లేదు. కానీ రజినీ మాత్రం రియాలిటీలోకి రావట్లేదని తెలుస్తుంది. ఒకప్పుడు రజినీ సినిమాలకు తమిళంతో పాటు తెలుగు మార్కెట్ అదనం. కానీ కొన్నేళ్లుగా అదీ పడిపోయింది. జైలర్‌కు కూడా బిజినెస్ తక్కువగానే జరుగుతుంది. కానీ దీనికి కూడా ఆయన భారీ పారితోషికమే అందుకున్నారు. రాబోయే జ్ఞానవేల్ సినిమాకు రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. రియాలిటీలోకి వస్తే గానీ.. రజినీకి హిట్స్ వచ్చేలా లేవు.

Leave A Reply

Your email address will not be published.