A place where you need to follow for what happening in world cup

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ… రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు

0 59
  • లక్ష పోస్టు కార్డులు రాయాలంటూ పిలుపునిచ్చిన టీడీపీ నేత అప్పలనాయుడు
  • లక్ష పోస్టు కార్డులు స్వయంగా ఢిల్లీలో రాష్ట్రపతి కార్యాలయంలో అందజేత
  • సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ పోస్టు కార్డులపై నినదించిన టీడీపీ మద్దతుదారులు

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్రపతికి లక్ష పోస్టు కార్డులు పంపాలని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల పిలుపునిచ్చారు. ఆ మేరకు వివిధ  వర్గాల ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా సంతకాలు చేసిన లక్ష పోస్టు కార్డులను అప్పలనాయుడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయంలో అందజేశారు.

సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ ఆ పోస్టు కార్డులపై రాశారు. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టింది. ఈ పోస్టు కార్డుల నిరసనకు టీడీపీ శ్రేణుల నుంచి భారీగా స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు పోస్టు కార్డులతో చంద్రబాబుకు సంఘీభావం పలికారు.

Leave A Reply

Your email address will not be published.