ఆగస్టు 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి,భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతపై అధికారులకు తగు సూచనలు చేశారు.