కిషన్ రెడ్డిపై జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఆ పార్టీ బహిషృత నేత జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. కిషన్ రెడ్డిని అచ్చి సమైక్యవాదిగా అభివర్ణించారు. కేసీఆర్ ఆదేశాలతోనే కిషన్ రెడ్డి నన్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశాడని ఆరోపించారు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన. ఎన్నికల తర్వాత ఇతర పార్టీలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చింది. భద్రాచలం రాముడి గుడిని అభివృద్ధికి చేయలేని సిగ్గు శరం లేని మంత్రి కిషన్ రెడ్డి. కుట్రలో భాగంగానే బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించారు.
మీడియాకు లీకులిచ్చి.. స్వయంగా ఈటల రాజేందర్ బీజేపీని బలహీన పరిచాడు. అమిత్ షా, జేపీ నడ్డాలను తిట్టిన రఘునందనరావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు. నన్ను సస్పెండ్ చేసేకంటే ముందు రఘునందనరావు, ఈటల, ఏ.చంద్రశేఖర్, రవీందర్ నాయక్ లను సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ విషయంలో మోదీ, అమిత్ షాలు కల్లబొల్లి మాటలు చెప్పున్నారు. కేసీఆర్ తో ఒప్పందంలో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని మునుగోడులో బలిపశువును చేశారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లిక్కర్ స్కాం కేసు నిర్వీర్యం అయింది. మూడు పర్యాయాలు పార్టీని నిర్వీర్యం చేసిన కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలివ్వటం దేనికి సంకేతం ? బీజేపీని హైదరాబాద్ కే పరిమితం చేసిన ఘనత కిషన్ రెడ్డిదే. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ రాజసింగ్ పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదని అయన ప్రశ్నించారు.