- కారు గుర్తుకు ఓటు వేయండి రామగుండం లో గులాబీ జెండా కు మద్దతుగా నిలవండి
- రామగుండం శాసనసభ్యులు బీ.ఆర్.ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్
గోదావరిఖని, ముద్ర : కాంగ్రెస్ పాలనంతా ద్రోహం నయవంచన.. మెాసం.. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలకు ప్రజలునమ్మితే మోసపోతాం గోస పడతామని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు అన్నారు. బుధవారం రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 6,7 డివిజన్లో ఎమ్మెల్యే గారు ప్రజా అంకిత యాత్రను చెపట్థారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ వారతులతో స్వాగతం పలికారు. అడుగడుగునా ఎమ్మెల్యే కి బహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలన అంతా చీకటి మయం అని 60 ఎళ్ల కాంగ్రెస్ పాలన మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కష్టాలు నెలకొన్నాయని అన్నారు. సంక్రాంతి సమయంలో గంగిరెద్దుల వాళ్లు వచ్చే విధంగా హైదరాబాదు లో భూకబ్జాలు దందాలు చేసి సంపాదుంచిన డబ్బులతో డబ్బు సంచులతో వచ్చే నాయకుల మాటలను ప్రజలు నమ్మ వద్దన్నారు. ఎన్నికల సమయంలో రావడం… ఎన్నికలయ్యాకా పోవడం … మాత్రమే వారికి తెలుసన్నారు.
రామగుండం నియోజకవర్గం లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ కార్యక్రమాలు తాము చేస్తున్నమన్నారు. డబ్బులు నోట్ల కట్టలతో ఈ ప్రాంతంలోని ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారికి తగిన బుద్ధి రమణ ప్రజలు చెప్పాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం కార్పోరేషన్ లో 350 కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. 60 ఏళ్ళ కాలంగా రామగుండం నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ప్రారంభింపచేశామన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధతీసుకోవాలని రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలన్నారు.
అందుబాటులో ఉన్న మెడికల్ కళాశాలలో మహిళలు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు అని చెప్పారు. గోదావరి నది నుండి పరిసర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరకుండా కరకట్ట నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి కేటీఆర్ విన్నవించామని కరకట్ట నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో 120 కేసులను తాము అనుభవించాలని ప్రత్యేక రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం సాధించానని చెప్పారు. తెలంగాణ భవితకు భరోసా గా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రూపోందిచారని ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రజహిత మ్యానిఫెస్టో రూపొందించారని రైతు బంధు ఎకరాకు ఏడాదికి రూ.16,000, తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం, ఒక కుటుంబానికి 4000 రూపాయలు భీమా చెల్లించి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పన, తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు దారునికి సన్న బియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, వికలాంగుల పింఛన్ 6 వేలకు పెంపు,సౌభాగ్య లక్ష్మీ పథకం అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు అర్హులైన లబ్ధిదారులకు రూ. 400 రూపాయలకే సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు చేశారన్నారు.
కాంగ్రెస్ బిజెపి మోసపూరిత మాటలకు ప్రజలు ఎవరు మోసపోవద్దని మనకోసం మా సంక్షేమం కోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రామగుండం నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు బీ. ఆర్. ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి,కార్పోరెటర్ కాల్వ స్వరూప, శ్రీనివాస్,కో ఆప్షన్ సభ్యుురాలు తస్నీంభాను ,బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు గంగ శ్రీనివాస్, అచ్చె వేణు, పీచర శ్రీనివాస్ కనకం శాంసన్,జహిద్ పాషా,పోలాడి శ్రీనివాసరావు,చిన్నాల విజయ్ కుమార్ గుంపుల ఓదెలు,నారాయణదాసు మారుతి ,బెంద్రంరాజిరెడ్డి,పెసరి స్వామి వంగ వీరస్వామీ, నూనే లతమెాహన్, విశాల్,ఠాగూర్ వేణు ,,నారాయణ తదితరులు పాల్గొన్నారు .