డిజిపిలుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితోపాటు అభిలాష బిస్త్, సౌమ్య మిశ్రా, షికా గోయల్‌లను ప్రభుత్వం డీజీపీలుగా ప్రమోట్ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడవి• డైరెక్టర్‌గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, సీఐడీ చీఫ్‌గా షికా గోయల్ పనిచేస్తున్నారు. వారు అవే స్థానాల్లో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొన్నారు.