A place where you need to follow for what happening in world cup

రాష్ట్రం మీదకు సిఎం రేవంత్‌ ‌సోదరులు

రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహారం
బిఆర్‌ర్‌ఎస్‌ ‌నేత, మాజీ ఎంఎల్‌ఏ ‌బాల్క సుమన్‌ ఆరోపణ

‌సీఎం రేవంత్‌ ‌తన సోదరులను తెలంగాణ వి•దకు వదిలేశారని.. అతని సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంఎల్‌ఏ, ‌బిఆర్‌ఎస్‌ ‌నేత బాల్క సుమన్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై సుమన్‌ ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్‌లో రేవంత్‌ ‌సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా స్పీకర్‌ ‌దగ్గర వికారాబాద్‌ ‌రివ్యూ వి•టింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. కొడంగల్‌లో తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే తమ జెడ్పిటీస్‌ ‌మహిపాల్‌ అడ్డుకున్నారని తెలిపారు.

 

రేవంత్‌ ‌మరో సోదరుడు కొండల్‌ ‌రెడ్డికి ఏ హోదా ఉందని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్‌ అమెరికా పర్యటనలో స్వచ్ఛ్ ‌బయోతో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని…ఆ కంపెనీ రేవంత్‌ ‌మరో సోదరుడు ఎనుముల జగదీశ్‌ ‌రెడ్డిదని తెలిపారు. పదిహేను రోజుల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటయ్యిందని అన్నారు. ఇవే కాకుండా రేవంత్‌ ‌సోదరుల ఆధ్వర్యంలో నాలుగు సంస్థలు ఏర్పాటు అయ్యాయన్నారు.

ఈ సంస్థల ద్వారానే రేవంత్‌ ‌బ్లాక్‌ ‌మనీని వైట్‌గా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధాన కంపెనిలే కాకుండా రేవంత్‌ ‌సోదరులు అనేక మైక్రో సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. రేవంత్‌ ‌సోదరులు రియల్టర్లను బెదిరించి విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.