A place where you need to follow for what happening in world cup

భారీగా దొరికిన నకిలీ సర్టిఫికెట్లు

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కేంద్రంగా వివిధ యూనివర్సిటీ లు, కాలేజీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్ల ను అమ్ముతున్న ముగ్గురు ముఠా సభ్యులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరి వద్ద నుండి దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన 467నకిలీ సర్టిఫికెట్లు 2లాప్ టాప్ లు, 40 సెల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు ,100 పేజీల విద్యార్థుల డేటా, మారుతి ఆల్టో కారుతో పాటు ఓపెన్ ప్లాట్ డాక్యుమెంట్లు,12వేల నగదు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గుంటూరు జిల్లాకి చెందిన నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ వలస వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో నివసిస్తూ అర్జున్ అకాడమీ నెలకొల్పాడు.

గోపి రెడ్డి జ్యోతి ని మేనేజర్ గా నియమించాడు. నరేష్ గౌడ్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా ఏర్పరచుకొని నాగార్జున అకాడమీ పేరుతో ఓపెన్ స్కూల్, ఓపెన్ కాలేజి, ఓపెన్ యూనివర్సిటీ చేయాలనుకునే వారికి తరగతులు నిర్వహిస్తున్నారు.2019 లో గుంటూరుకి చెందిన జ్యోతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్లాన్ వివరించింది. అందుకోసం నకిలీ సెర్టిఫికట్ తయారీ చేసి అమ్మకాలు చేపడతామని నాగార్జునకి తెలిపింది. నకిలీ సెర్టిఫికట్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్‌‌కి చెందిన అరవింద్, చిన్నయ్య బిస్వాస్ సహకారం కోరింది. ఇద్దరు కలిసి నల్లకుంట కి చెందిన నరేష్ ని జత కలుపుకొని ఓపెన్ డిగ్రీ కళాశాలని యధావిధిగా నడిపిస్తున్నారు.

నకిలీ సెర్టిఫికట్లు కావాలనుకున్న వారిని గుర్తించి తమ వద్దకు తీసుకువస్తే కమిషన్ ఇస్తామని చెప్పారు. అదే సమయంలో టెలీ కాలర్ లను ఏర్పాటు చేసి ఓపెన్ డిగ్రీ కోసం ప్రయత్నాలు చేసే వారిని గుర్తించేవారు. ఈ కేటుగాళ్లు వారికి మాయమాటలు చెప్పేవారు. పరీక్షలు రాయకున్నా దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 24 యూనివర్శిటీలలో డిగ్రీ పాసైనట్లు సెర్టిఫికట్‌లు అందిస్తామని నమ్మించేవారు. యువకుల అవసరాన్ని బట్టి డబులు డిమాండ్ చేస్తూ సంపాదిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో మీర్ చౌక్ పోలీసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఫేక్ సర్టిఫికెట్లు, ఫోన్లు, నగదు, ఓపెన్ ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఓ కార్ సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.