మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం
పదిరోజుల పాటు పలు దిగ్గజ కంపెనీలతో చర్చలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప్రయాణం ప్రారంభం కానుంది. శనివారం రాత్రి ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళతారు. మధ్యాహ్నానికి ఆయన అమెరికా చేరుకుంటారు. దాదాపు పదిరోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో జరిగే ఈ టూర్‌లో వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు. వేకువజామున 4.35 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కలిసి అధికారుల బృందంతో అమెరికా, దక్షిణ కొరియా టూర్‌కు వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ బృందం న్యూయార్క్ చేరుకుంటుంది. ఆరోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత నాల్గో తేదీ నుంచి అధికారిక కార్యక్రమాల్లో సీఎం బృందం పాల్గొంటుంది. నాల్గో తేదీన మొదట న్యూజెర్సీలో ఉన్న ప్రవాస తెలంగాణ ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. వీలున్నంత వరకు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేయాలని వారిని కోరనున్నారు.
అనంతరే ఐదారు తేదీల్లో వాణిజ్య, వ్యాపార ప్రతినిధులతో న్యూయార్క్‌లో రేవంత్ టీం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనుంది. ఆరో తేదీ పెప్సికో, హెచ్‌సీఏ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకొని అక్కడ వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో భేటీ అవుతారు. ఏడో తేదీన డల్లస్‌లో బిజినెస్ సంస్థల ప్రతినిధులతో మరో భేటీ ఉంటుంది. అక్కడ గాంధీ స్మ•తి కేంద్రాన్ని సందర్శిస్తారు. తర్వాత రోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈవో, ఇతర వ్యాపర సంస్థల ప్రతినిధులు, 9న గూగుల్, అమెజాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆ రోజు సాయంత్రం తెలంంగాణ ఎన్‌ఆర్‌ఐలతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి సీఎం నేరుగా దక్షిణకొరియా చేరుకుంటారు. సియోల్‌లో 12,13 తేదీల్లో ఎల్బీ, శామ్‌సంగ్ సహా వివిధ వ్యాపార సంస్థల అధినేతలతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం ఉన్న పరిస్థితులు వాళ్లకు వివరించనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. పద్నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన చేయనున్నారు.
ఆగస్టు 14 వరకూ సీఎం షెడ్యూల్ కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్ శాంతి కుమారి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు సైతం విదేశాలకు వెళ్లనున్నారు. ఆగస్ట్ 5 వ తేదీన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికా వెళ్లనున్నారు. నేటి నుంచి 9 వ తేదీ వరకూ న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ప్రాన్సిస్కో, నగరాల్లో పర్యటించనున్నారు. అమెరికాలో పలువురు వ్యాపార వేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. 5వ తేదీన న్యూయార్క్ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ కానున్నారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశంతో పాటు ఐటి సంస్థలతో భేటీ కానున్నారు. 7న చార్లెస్ స్కాబ్ హెడ్, మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించనున్నారు. 8వ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్ జెన్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. 9న గూగుల్ సినియర్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాకు సీఎం బృందం వెళ్లనుంది.
12న సియోల్‌లో యూయూ పార్మ, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్టస్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశం కానుంది. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్‌తో భేటీ కానుంది.14న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. గడిచిన సారి విదేశాల పర్యటనతో నలబై వేల కోట్ల పెట్టుబడులను రేవంత్ తీసుకొచ్చారు. ఈ పది రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో కంపెనీల అధిపతులతో సీఎం నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది.