A place where you need to follow for what happening in world cup

నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్

0 71
  • బీఆర్ఎస్ పాలనలోనే అన్నివర్గాలకు న్యాయం
  • పేదవాడి సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాల దుష్ప్రచారం
  • మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

అసెంబ్లీ ఎన్నికల వేళ  ఇతర పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారు. నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపహాడ్  గ్రామానికి చెందిన 40 మంది, దిలావర్ పూర్  మండలానికి చెందిన 30 మంది,  నర్సాపూర్ మండలానికి చెందిన 30 మంది, లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన పలువురు  బీజేపీ, కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరారు. అదేవిధంగా అంబేడ్కర్ యువజన సంఘాలకు చెందిన పలువురు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సారధ్యంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని, దళితబంధు, బీసీ బంధు, మైనార్టీలకు ఆర్థిక సహాయం రైతు రుణమాఫీ తో  ఇతర పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.  బీఆర్ఎస్ శ్రేణుల్లో  కూడా  మరింత జోష్ పెరిగిందని తెలిపారు.రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతరపార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులు పభుత్వ పథకాలు, సంక్షేమం చూసి తట్టుకోలేక అధికార పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత నాయకుల మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని వివరించారు.

కలిసికట్టుగా పార్టీ కోసం కృషిచేసి  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపించుకుని హ్యాట్రిక్ విజయాన్ని  అందిస్తామని పార్టీలో చేరిన సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు. నిర్మల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా  అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆద్వర్యంలో తమ గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో  తాము మంత్రికి మద్దతుగా  బీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.