ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఎండలు
న్యూదిల్లీ,ఏప్రిల్3: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా నడచుకోక పోవడం వంటి కారణాలతో దేశంలో ఏటేలా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధాం ణం అయ్యాయి. దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా మార్చి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం వెల్లడిరచింది. పశ్చిమ అలజడులు లేకపోవడం వల్ల వర్షపాతంలో లోటు ఏర్పడిరదని, అందుకే ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది. గతేడాది తక్కువ వర్షపాతం నమోదైందని, అది సాధారణం కన్నా 71 శాతం తక్కువని తెలిపింది. 1901 మార్చి నుంచి ఇంత తక్కువ నమోదు కావడం ఇది మూడోసారని చెప్పింది. రాష్ట్రంలో భానుడు భగ్గు మంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటుతుండటంతో ఇండ్ల నుంచి బయటికొచ్చేందుకు జనం జంకుతున్నారు. వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల లోపు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడిరచింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్జన్ మంగళవారం సలహాలు, సూచనలు జారీ చేశారు. ఎండలో పనిచేయడం, ఆటలాడటం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని చెప్పారు. పార్క్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్‌డ్రిరక్స్‌కు దూరంగా ఉండాలని చెప్పారు. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్ కంటే ఎకువగా నమోదవడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు. జంటనగరాల్లోనూ ఎండలు మండుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో 41-42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో వడగాల్పుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. జనసంచారం తగ్గి రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యధికంగా మూసాపేట- 41.9, ఖైరతాబాద్, చందానగర్- 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవి ఎండల్లో అగ్నిప్రమాదాలు
అడవుల్లో మంటలు చెలరేగకుండా చర్యలు
ముందస్తు హెచ్చరిక చేసిన అధికారులు
వేసవి ఎండలు తీవ్రం అవుతున్నందున అగ్నిప్రమాదాలు జరగకుండా గ్రామాల్లో జాగ్రత్తలు పాటించాలని అధికారులు క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించారు. అలాగే అడవుల్లో మంటలు చెలరేగకుండా అటవీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అన్నారు. రైతులు వరి పొలాల్లో చెత్తను కాలబెట్టే సమయంలో సప అటవీ సంపదకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వేసవి కాలంలో అటవీ సంపద అగ్నికి ఆహుతి అవుతుందని, దానిని కాపాడేందుకు స్థానిక వీఆర్వోలు చర్యలు తీసుకోవాలని గ్రామ సంరక్షణ కమిటీలు, వీఆర్వోలు గ్రామంలోని వారందరికీ అటవీసంపద కాపాడుకునే అంశాన్ని వివరించాలన్నారు. ఇకపోతే ఎండాకాలంలో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి రాపిడి కావడంతో నిప్పురవ్వలు ఎగిసి పడి ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలపై గతంలోనూ ముందస్తు హెచ్చరికలుచేశారు. గ్రామ పటాలు, రైతుల భూములు తదితర వివరాలు దగ్గర పెట్టుకుని ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు తహసీల్దార్లకు తెలియజేయాలని సూచించారు. ఆ తర్వాత మండల నివేదికలను డీఆర్వోకు సమర్పించాలని ఆదేశించారు.