A place where you need to follow for what happening in world cup

కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గంగుల ?

0 2,577
  •  కాంగ్రెస్ లో చేరికకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
  •  వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
  •  పొన్నం ప్రభాకర్ నిర్ణయం పై సర్వత్ర ఉత్కంఠ
  •  సెన్సేషన్ గా మారనున్న గంగుల చేరిక 

కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు  ఢిల్లీ పెద్దలు  పరిశీలిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మధ్యవర్తిత్వంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి తో చర్చలుసఫలం అయినట్లు  పొలిటికల్ సర్కిల్ లో చర్చ జోరుగా నడుస్తుంది. బిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 9 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెసులో చేరి  సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కడియం శ్రీహరి కూతురు నవ్య కు బిఆర్ఎస్ అధిష్టానం వరంగల్ టికెట్ కేటాయించారు.

ఓడిపోయే పార్టీ నుండి బరిలో నిల్వలేమంటూ కెసిఆర్ కు షాక్ ఇచ్చారు. తాజాగా కడియం శ్రీహరి, కూతురు నవ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి కడియం శ్రీహరి కూతురు నవ్య బరిలో నిలిచారు. ఇది ఇలా ఉండగా కరీంనగర్ ఎంపీ టికెట్ గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దృష్టిసారించింది. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.  గంగుల కమలాకర్ పేరు పరిశీలనలో ఉండడం కూడా  కరీంనగర్ ఎంపీ టికెట్ ప్రకటన జాప్యం కావడానికి కారణంగా తెలుస్తుంది.

ఇప్పటివరకు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావుల మధ్య దోబూచులాడిన టికెట్  గంగుల పేరు ప్రస్తావనకు రావడంతో  ఒక్కసారిగా కరీంనగర్ రాజకీయాలు వేడెక్కాయి. అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు బిఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురవుతున్నారు. అయితే స్థానిక రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాని  చేరికకు మార్గం సుగమం అయ్యే పరిస్థితి లేదు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేక స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బ్రేక్ వేస్తాడా అన్నది తేలాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.