నల్గోండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 90వ రోజు నల్లగొండ జిల్లాలో కొనసాగింది. నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం ఆవగూడెం క్రాస్ రోడ్ నుంచి బట్టి విక్రమార్క పాదయాత్ర ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయింది.
ఆవగూడం క్రాస్ రోడ్, లక్ష్మీదేవి గూడెం క్రాస్ రోడ్ మీదుగా నల్లగొండ నియోజకవర్గం కనగల్ ఎక్స్ రోడ్ లోకి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రవేశించింది. లంచ్ బ్రేక్ తరువాత నల్గొండ నియోజకవర్గంలోని పర్వతగిరి, దోరేపల్లి ఎక్స్ రోడ్, ధర్వేశిపురం, జి చెన్నారం గ్రామాల వరకు పాదయాత్ర కొనసాగింది.