ఉత్సాహంగా పాల్గొన్న యువత…రంగులమయంగా మారిన హైదరాబాద్
ఈవెంట్లతో రెట్టింపయిన పండుగ సందడి
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించిన దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల హోలీ వేడుకలు
ఆదిలాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం…వార్దా నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ పండుగ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెను విషాదం నెలకొంది. కొమరం భీమ్ జిల్లా తాటిపల్లి వద్ద వార్దా నదిలో స్నానానికి దిగిన నలుగురు యువకులు నదిలో గల్లంతయిన విషాద ఘటన చోటు చేసుకుంది.. లోతు సరిగా అంచనా వేయకపోవడంతో నదిలోకి దిగినవారు ఒక్కొక్కరుగా మునిగిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టగా నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కాగా యువకులందరూ 25 ఏళ్ల లోపే కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు నదీమాబాద్‌కు చెందిన సంతోష్ కుమార్, ప్రవీణ్, సాయి, కమలాకర్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబీకులు రోదనలు చూసిన వారికి కంటతడి పెట్టించాయి.