- ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అద్భుత విజయం
- జనసేనాని పవన్ కల్యాణ్‌పై ప్రశంసల జల్లు
- ఎన్నికల్లో జనసేనాని అఖండ విజయం పట్ల కమల్ హర్షం
- ‘ఎక్స్’ వేదికగా పవన్‌కు విశ్వనటుడి శుభాకాంక్షలు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనాని పవన్ కల్యాణ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎన్నికల్లో పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ అభ్యర్థులు అఖండ విజయాన్ని అందుకున్నారు. దీంతో రాజకీయ ప్రముఖులతో పాటు సినీప్రముఖులు సైతం పవన్ విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఎన్నికల్లో జనసేనాని సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమల్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘ఎన్నికల్లో విజయంపై పవన్‌తో జరిగిన సంభాషణ చాలా ఉద్వేగభరితమైనది. ఎన్నికల్లో ఘన విజయంపై పవన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు ఈ యాత్రను ప్రారంభించినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా’’ అంటూ కమల్ ట్వీట్ చేశారు.
ఇక కమల్ హాసన్ తమిళనాడులో ‘మక్కల్ నీది మయ్యం’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కమల్ పరాజయం పాలయ్యారు. అనంతరం డీఎంకేకు ఆయన మద్దతిచ్చారు. ప్రస్తుతం కమల్ నటించిన రెండు మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో చేసిన ‘భారతీయుడు-2’ మూవీ. రెండోది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో కమల్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.