A place where you need to follow for what happening in world cup

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం

ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్:హైదరాబాద్ అబిడ్స్ లోని డాక్ సదన్, చీఫ్ పోస్ట్ మాస్టర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక పోస్టల్ కవర్ అవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన పోస్టల్ కవర్ను విడుదల చేసుకోవడంతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలోని ‘బావాపూర్ కుర్రు’ గ్రామంలో తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ.. ఓ పోస్టు కార్డును ఆవిష్కరించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టల్ కవర్, పోస్టు కార్డు ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించే 5వ శతాబ్దం నాటి ప్రాంతాలను గుర్తుచేసుకోవడం దీన్ని ఓ పోస్టు కార్డు ఆవిష్కరణ ద్వారా మరోసారి మన సమాజానికి గుర్తుచేసే  ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ పోస్టల్ శాఖ 5 పోస్టు కార్డుల సెట్ను విడుదల చేయడం సంతోషకరం.మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పోస్టల్ శాఖ ద్వారా ఇలాంటి ప్రయత్నాలు ఇకపైనా కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.
బ్యాంకులు లేని చోట సేవింగ్స్ విషయంలో, ఇతర లావాదేవీల విషయంలో పోస్టాఫీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏదైనా సాధ్యమే అని ప్రధాని  చాలా బలంగా నమ్ముతారు.  అందుకే ప్రభుత్వ కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల్లో.. ఇలా దేనిలోనైనా.. ప్రజలతో మమేకమై.. వారిని భాగస్వాముులుగా చేయాలని అప్పుడే అనుకున్న ఫలితాలు సాధింగచలమని చెబుతారని అన్నారు.పోస్టాఫీసు సిబ్బంది ద్వారా 10వేలకు  పైగా వర్చువల్  ఫ్లాగ్స్ పిన్ అయ్యాయి.

ఇప్పటివకు జరిగిన 5 రోజ్గార్ మేళాల ద్వారా మన తెలంగాణలోనే 435 పోస్టులు.. పోస్టాఫీసు శాఖలో భర్తీ అయ్యాయి. పోస్టాఫీసుల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మారుమూల ప్రాంతాలకు సేవలను అందించాలన్నది మోదీ గారి ప్రయత్నం సపలమైంది అంటే అది మోదీ గారి సంకల్పం మాత్రమే నని అన్నారు.ఈ రోజు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది అది మోదీ న్యాయకత్వానికి నిదర్శనం. భారత్ అభివృద్ధి లో మీ సహకారం ఉద్యోగస్తుల సహకారం అమోఘం అని చెప్పాలి. తెలంగాణ లో సైతం అద్భుతమైన జాతీయరహదారుల నిర్మాణం జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్  నిర్మాణానికి శ్రీకారం చుట్టం  దానికి సమాంతరంగా ఔటర్ రైల్ రింగ్ ప్రాజెక్ట్ కు ఆమోదం లభించిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.