98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో హైదరాబాద్ లోని ఈ శాటిలైట్ టెర్మినల్ తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించనున్నది.
ఈ టెర్మినల్ సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గిస్తుంది. రూ. 434 కోట్లుతో నిర్మిస్తున్న ఈ స్టేషన్‌లో 19 కొత్త లైన్లతో పాటు అదనంగా 15 జతల రైళ్లను నిలిపే సౌకర్యం ఉన్నది. ఈ టర్మినల్ తెలంగాణ రైల్వే అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషించనున్నది.