A place where you need to follow for what happening in world cup

వైసీపీకి రాజీనామా చేసిన పార్టీ సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి

  • శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీలో లుకలుకలు
  • పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చిన వైసీపీ నాయకత్వం
  • భగ్గుమన్న అసంతృప్తులు
  • పదవికి, పార్టీకి రాజీనామా చేసిన లోచర్ల విజయభాస్కర్ రెడ్డి

వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి నేడు ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పుట్టపర్తి అభివృద్ధికి కట్టుబడి ఉండే పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు.

లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అసంతృప్తి గళం వినిపించారు. శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తే పనిచేయబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రవర్తన మూలంగా నాయకులు పార్టీకి దూరమవుతున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో, పుట్టపర్తి టికెట్ ను వైసీపీ నాయకత్వం మరోసారి శ్రీధర్ రెడ్డికే ఇవ్వడంతో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పార్టీని వీడినట్టు అర్థమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.