A place where you need to follow for what happening in world cup

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

రూ.9 కోట్ల విలువచేసే 90 కిలోల డ్రగ్స్‌ పట్టివేత
బొల్లారం పారిశ్రామిక వాడలోని పిఎస్‌ఎన్‌
మెడికేర్‌ పరిశ్రమలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల సోదాలు
గత పదియేళ్లుగా పరిశ్రమలో అక్రమ దందా

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్‌ ను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్‌ ను స్వాధీనం పరుచుకున్నట్టు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడిరచారు. ఇంటర్‌ పోల్‌ సహాయంతో ఓ కంపెనీ లో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపీడ్రిన్‌ డ్రగ్స్‌ ని అధికారులు స్వాధీన పరుచుకున్నారు.image.png దీని విలువ మార్కెట్లో 9 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్‌ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో పరిశ్రమ నిర్వాహకురాలు కస్తూరి రెడ్డిని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు అరెస్టు చేశారు. సిగరెట్‌ ప్యాకెట్లలో డ్రగ్స్‌ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు తేల్చారు. అదేవిధంగా నగరంలో కూడా డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు వెల్లడిరచారు. కాగా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులతో బొల్లారం పారిశ్రామికవాడ దద్దరిల్లింది.

Leave A Reply

Your email address will not be published.