A place where you need to follow for what happening in world cup

దేశమాత స్వేచ్ఛ కోసం అసువులు బాసిన అమర వీరులు

దేశమాత స్వేచ్ఛ కోసం బలిదానం చేసిన వీర యోధులు భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం వీరికి ఉరిశిక్ష విధించిన భయపడకుండా నవ్వుతూ ఉరి కంభం ఎక్కి దేశం కోసం ప్రాణాలను అర్పించి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహా వీరులు. వీరు త్యాగం వృధా కాలేదు దేశానికి స్వతంత్రం తెచ్చి పెట్టింది. వీరి జీవితం భవిష్యత్తు భారత యువతరానికి స్ఫూర్తిదాయకం. యువకుల కు స్ఫూర్తినిస్తూ దేశభక్తిని చాటి చెప్పిన అమర యోధుడు భగత్‌ సింగ్‌. తన ధైర్యంతో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ముచ్చమటలు పట్టించిన మరో యోధుడు రాజ్‌ గురు. తన చిరునవ్వుతో మరణాన్ని సైతం ఓడిరచి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన మరో ఘనుడు సుఖదేవ్‌. మార్చి 23 1931 నా వీరు చేసిన త్యాగాలు భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఒక కొత్త మార్గం చూపింది.. బ్రిటిష్‌ చీకటి సామ్రాజ్యం నుంచి భారతదేశానికీ స్వేచ్ఛ స్వతంత్రపు క్రాంతి విరజిమిందంటే వీరి ప్రాణత్యాగమే దానికి గల కారణం.భారత స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ ల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ముగ్గురు యువకులు మన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసి, భారతీయుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.1928 డిసెంబర్‌ 17న లాహోర్‌ లో సాండర్స్‌ హత్య కేసులో ఈ ముగ్గురిని బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. 1929 లో లాహోర్‌ కుట్ర కేసులో కూడా వారిపై ఆరోపణలు వచ్చాయి. 1930 లో న్యాయస్థానం వారికి ఉరి శిక్ష విధించింది.ఉరి శిక్ష ఖరారు అయిన తర్వాత, భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ లు జైలులో చాలా ధైర్యంగా ప్రవర్తించారు. వారు తమ చివరి క్షణం వరకు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతదేశం అంతట ఈ ఉరిశిక్ష పై భారీ నిరసనలు జరిగాయి.

భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌, దేశభక్తులుగా, స్వతంత్ర సమరయోధులుగా గుర్తింపు పొందారు. వారి త్యాగం భారత స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. భగత్‌ సింగ్‌ రాజ్‌ గురు సుక్‌ దేవ్‌ ల ఉరిశిక్ష భారత స్వతంత్రం పోరాటంపై లోతైన ప్రభావాన్ని చూపింది. దేశవ్యాప్తంగా స్వతంత్ర కాంక్ష మరింత బలపడిరది. భారతీయులలో బ్రిటిష్‌ పాలన పట్ల వ్యతిరేకత పెరిగింది. వీరి ఉరిశిక్ష వీరి ప్రాణత్యాగం భారత స్వతంత్ర పోరాటంలో మరువలేని ఘట్టం. భగత్‌ సింగ్‌,రాజ్‌ గురు,సుక్‌ దేవ్‌ లు హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారు. 1928లో భారతీయ విద్యార్థులపై జరిగిన అణిచివేతలకు నిరసనగా భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌, లు బ్రిటిష్‌ పోలీస్‌ అధికారి సాండర్స్‌ ను హత్య చేశారు. ఈ హత్య భారత స్వతంత్ర పోరాటం పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ హత్య కేసులో1931 మార్చి 23న ఈ ముగ్గురిని ఉరితీశారు. వీరికి ఉరిశిక్ష ఖరారు అయ్యే నాటికి వారి వయస్సు భగత్‌ సింగ్‌ 23 సంవత్సరాలు, రాజ్‌ గురు 22 సంవత్సరాలు, సుక్‌ దేవ్‌ 23 సంవత్సరాలు. ఉరిశిక్ష ఖరారు అయిన తర్వాత భగత్‌ సింగ్‌ ‘‘మేరా రంగ్‌ బసంతి చోలా’’అనే ప్రసిద్ధ కవితను రాయటం విశేషం. వారి ఉరి శిక్ష భారతదేశం అంతటా భారీ ఆగ్రహానికి దారితీసింది. వారి త్యాగం భారతీయులలో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచింది.భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ ల ఉరి శిక్ష భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక మలుపు తిరిగిన క్షణం. వారి త్యాగం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా మారి, స్వాతంత్య్ర సాధన కోసం మరింత పోరాడేందుకు వారిని ప్రోత్సహించింది.ఈ ముగ్గురు యువకుల త్యాగం భారత చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది.ఉరి శిక్ష ఖరారు అయిన తర్వాత, భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ లు తమ చివరి కోరికలను తెలియజేశారు.భగత్‌ సింగ్‌ తన చివరి కోరికలో భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడే యువతకు ఒక సందేశాన్ని ఇచ్చాడు.రాజ్‌ గురు తన చివరి కోరికలో భగవద్గీతను వినాలని కోరుకున్నాడు.సుఖదేవ్‌ తన చివరి కోరికలో తన తల్లిదండ్రులను చూడాలని కోరుకున్నాడు.ఈ ముగ్గురిని ఉరితీసిన తర్వాత, వారి మృతదేహాలను లాహోర్‌ లోని షాహీ ఖిలా లో సమాధి చేశారు.భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ ల ఉరి శిక్ష భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక విషాద ఘట్టం. ఈ ముగ్గురు యువకుల త్యాగం భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది. యువత సెల్‌ ఫోన్‌ నుంచి బయటకు వచ్చి సమాజాన్ని చూసి సమాజం పట్ల అవగాహన కలిగించుకొని బాధ్యతతో దేశ భవిష్యత్తు కి తోడ్పడాలని కోరుకుంటూ.భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుక్‌ దేవ్‌ లకు చేసిన త్యాగాలకు సెల్యూట్‌ చేస్తూ జైహింద్‌!
(మార్చి 23 భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ ల వర్ధంతి సందర్భంగా…)

Leave A Reply

Your email address will not be published.