A place where you need to follow for what happening in world cup

దేశ ద్రోహులకు దేశ భక్తులకు మధ్య జరిగే పోరాటమే ఈ ఎన్నికలు

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: దేశ ద్రోహులకు, దేశ భక్తులకు మధ్య జరిగే పోరాటమే ఈ ఎన్నికలు అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. బిజేపీ శాఖ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ 500 సంవత్సరాలు నుంచి మన శ్రీరాముడు టెంట్లు పెట్టారని అక్కడే పూజలు చేసుకున్నామని, కాని ఈనాడు మనం భవ్య మందిరాన్ని నిర్మించుకున్నామని అన్నారు.

రజాకర్ల పార్టికి ఓటు వేయద్ధని, దేశ గౌరవం నిలబడాలంటే నరేంద్ర మోదిని మళ్ళి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డా. బోగ శ్రావణి, నాయకులు చిలుకమర్తి మదన్ మోహన్, అనుమల్ల క్రిష్ణహరి, కొక్కుగంగాధర్, రంగు గోపాల్ తదితరలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.