A place where you need to follow for what happening in world cup

విజయవంతంగా ముగిసిన ‘వన్’ క్రికెట్ లీగ్

మండలంలోని కొండగట్టు మారుతి టౌన్ షిప్ లో కరీంనగర్ లోని వన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి, నిర్వాహకులు వెల్మ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ లీగ్ విజయవంతంగా ముగిసింది. ఈ లీగ్ లో సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగగా ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇరు జట్ల సభ్యులను అభినందించి, విజేతలకు అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 56 టీమ్ లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో చొప్పదండి నియోజకవర్గంలోని ముత్యంపేట గ్రామం విన్నర్ కప్ గా, గంగాధర గ్రామం రన్నర్ కప్ గెలవడం సంతోషకర విషయం అని యువత క్రికెట్ లోనే కాకుండా అన్ని క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దారం ఆది రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సతీష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ముత్యం శంకర్, వోల్లాల మల్లేశం, మనోజ్, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.