A place where you need to follow for what happening in world cup

విజిలెన్స్ పైనే ‘లెన్స్’

  • రికార్డింగ్ చేసి బెదిరించిన ఇసుక మాఫియా
  • నివేదిక పంపకుండా బెదిరింపులు 
  • ప్రిన్సిపల్ సెక్రటరీపై పంజా
  • తెర వెనుక ప్రముఖుల హస్తం
  • చక్రం తిప్పుతున్న డాన్
  • చర్యలకు వెనుకాడుతున్న కలెక్టర్ 
  • పట్టా భూముల పేరుతో గోదావరిని కొల్లగొడుతున్న ఇసుకాసురులు
  • నడి గోదావరిలో అక్రమ తవ్వకాలు
  • మైనింగ్ అధికారి సహకారం
  • ములుగు జిల్లాలో ఇసుక తుఫాన్

పోలీస్ శాఖలోని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం పేరు చెపితే అక్రమార్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. కానీ ఇది ఒకప్పటి మాట. దర్యాప్తునకు వచ్చిన అధికారులనే ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ములుగు జిల్లాలోని ఇసుక మాఫియా కథ వింటే వారు ఎంతకి తెగించారో అర్థమవుతుంది. పట్టా భూముల పేరుతో ఇసుక తవ్వకాల కోసం 

రైతులతో ఒప్పందాలు చేసుకున్న బినామీ ఇసుక కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అనుమతులు తీసుకున్న ప్రదేశంలో కాకుండా గోదావరి నది మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు సాగిస్తున్న అక్రమార్కులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండదండలు లభించడంతో చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతులు వచ్చాయి. ఎనిమిది ఇసుక రీచ్ లకు అనుమతులు ఇప్పించడం కోసం ఉన్నత స్థాయిలో చక్రం తిప్పిన ‘డాన్’ అంతా తానై నడిపించాడు. అతని సహకారంతో దళారులు హైదరాబాద్, ఏపీకి చెందిన కొందరు వ్యక్తులకు కోట్లాది రూపాయలకు ఈ ఇసుక రీచ్ లను అమ్మివేశారు. ఒక విశ్రాంత పోలీస్ అధికారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీలోని ఒక సీనియర్ నేత, ఏపీ కి చెందిన ఇసుక డాన్ ఈ ఇసుక రీచ్ లను దక్కించుకున్నారని స్థానికులు అంటున్నారు. 

వివిధ జిల్లాల్లో కొత్త రీచ్ లకు అనుమతులు ఇవ్వక పోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట్ రీచ్ లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా భావించిన ఇసుక మాఫియా అక్రమాలకు తెరలేపింది. తమకు అనుముతులు ఇచ్చిన ప్రదేశాల్లో నాణ్యమైన ఇసుక లేక పోవడంతో నిబంధనలను అతిక్రమించి గోదావరి మధ్య భాగంలో ఇసుక తవ్వకాలు ప్రారంభించింది. సీరియల్ పేరుతో ప్రతి లారీ వద్ద రూ. 3,500 అదనంగా వసూలు చేయడం కూడా వివాదాస్పదమైంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల పేరుతో ఎక్కడ పడితే అక్కడ ఇసుక తీస్తే తమకు వరద ముప్పు తప్పదని తీర ప్రాంత ప్రజలు అందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని రెండు వారాల క్రితం మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా దృష్టికి తీసుకు వెళ్ళారు. మైనింగ్ మాఫియా అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ ఆదేశం మేరకు వరంగల్ ప్రాంతీయ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు విషయాన్ని కొందరు అధికారులు ముందుగానే సమాచారం లీక్ చేయడంతో మాఫియా అలర్ట్ అయింది. దర్యాప్తునకు వస్తున్న అధికారుల వివరాలను తెలుసుకుని వారికి ముడుపులు చెల్లించినట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. 

అంతటితో ఆగకుండా ముడుపులు చెల్లించిన సందర్భంలో వీడియో రికార్డింగ్ చేశామని, మొబైల్ సంభాషణ రికార్డింగ్ చేశామని మాఫియా ప్రచారం చేసింది. తమకు అనుకూలంగా నివేదిక రాయక పోతే అవి బయట పెడతామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.

ఇసుక రీచ్ లను ప్రత్యక్షంగా పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అక్కడ జరిగే అక్రమాల గురించి పట్టించు కోకుండా తూతూ మంత్రంగా దర్యాప్తును పూర్తి చేయడమే కాక మంగపేటలో మాఫియా ఇచ్చిన విందు భోజనాలను ఆరగించి వెళ్ళి పోయినట్టు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ వ్యవహార మంతా మైనింగ్ శాఖకు చెందిన అధికారి

తో పాటూ టీఎస్ఎండీసీ అధికారి కూడా దగ్గర ఉండి నడిపించినట్టు కూడా ఫిర్యాదులు అందాయి. నిష్పాక్షింగా దర్యాప్తు జరిపి నివేదిక పంపాలని ఉన్నతాధికారుల నుంచి మళ్ళీఆదేశాలు రావడంతో దర్యాప్తు బృందానికి గొంతులో వెలక్కాయ పడినంత పనైంది. మరో వైపు తమకు అనుకూలంగా అన్నీ సక్రమంగా ఉన్నట్టు నివేదిక పంపాలని మాఫియా బెదిరింపులకు పాల్పడింది. మూడు రోజులు సమయం ఇస్తున్నామని, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మేనేజ్ చేసుకోక పోతే తాము ఉన్నది ఉన్నట్టు నివేదిక పంపుతామని దర్యాప్తు బృందం తేల్చి చెప్పడంతో మాఫియా

రూటు మార్చింది. మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బదిలీ కోసం చక్రం తిప్పింది. ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రభుత్వం బదిలీ చేయడంతో మాఫియాతో పాటు విజిలెన్స్ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంతా సజావుగా సాగిపోవడంతో మైనింగ్ మాఫియా మళ్ళీ చెలరేగిపోతున్నది. యధేచ్ఛగా తమ అక్రమాలను కొనసాగిస్తున్నది. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరక పోవడంతో కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా మౌనంగా ఉండిపోయారు.

కలెక్టర్ మౌనం వెనుక..

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల విషయంలో ఎన్ని ఫిర్యాదులు అందినా జిల్లా కలెక్టర్ స్పందించక పోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇసుక కమిటీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న కలెక్టర్ మౌనం వెనుక మాఫియా ఒత్తిడి కారణమని తెలుస్తున్నది. మైనింగ్ శాఖ జిల్లా అధికారి, టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారి జిల్లా కలెక్టర్ ను పక్కదారి పట్టిస్తున్నారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులను ఇచ్చే సందర్భంలోనే కలెక్టర్ పై ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. 

 

Leave A Reply

Your email address will not be published.