- వారి వద్ద రూ. 14,48,000 లక్షల భారీ నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం
- విలేకరుల సమావేశంలో రామగుండం సిపి శ్రీనివాసులు
పేకాట ఆడుతున్న స్థావరంపై మెరుపు దాడి చేసి 10 మంది వ్యక్తులను పట్టుకొన్నమని రామగుండం సిపి శ్రీనివాసులు మంగళవారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ టీమ్, టాస్క్ ఫోర్స్ సీఐ సంజయ్ అధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని మూడు ముక్కలు (పేకాట) ఆడుతున్నారనే, పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసి 10 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.. వారి వద్ద నుండి పెద్ద ఎత్తున 10 సెల్ ఫోన్లు, రూ. 14,48,000 లక్షల నగదు, పేక ముక్కలు స్వాధీనపరుచుకున్నమన్నారు.

సందెల తిరుపతి, అన్నాల తిరుపతి, చోటు, వరంగల్ మొదలగు కొంతమంది కలిసి ఒక టీం గా ఏర్పడి పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ ఆసిఫాబాద్, ఏరియల నుండి పేకాటా ఆడే కొంతమంది ప్లేయర్లను పిలుచుకొని, కొంత పెట్టుబడి పెట్టి, అటవి ప్రాంతాలలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలు ఏర్పాటుచేసి, వచ్చిన ఆటగాళ్ల నుండి కొంతమొత్తంలో వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో నలుగురు లేదా ఐదుగురు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి కంపెనీ పెట్టుబడిగా సుమారు రూ. 5 లక్షల వరకు పెట్టడం జరుగుతుందని, వచ్చిన ప్లేయర్ల నుండి కొంత మేర కమిషన్ కింద వసూలు చేస్తూ, సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు ఆడే ప్రదేశానికి చుట్టుపక్కల రహస్యంగా కొంతమంది వ్యక్తులను సెంట్రీలుగా ఏర్పాటు చేసుకొని, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని పోలీసు వారు గాని వచ్చినట్లయితే త్వరగా సమాచారం అందించే ఏర్పాటు చేసుకుంటారని సిపి తెలిపారు.