జానయ్య పేరు చెబితే దళిత బంధు గృహలక్ష్మి ఇవ్వక పోవడం ఎంతవరకు కరెక్ట్
దొరల రాజ్యం పోయి బహుజన రాజ్యం రావాలని, బీఎస్పీ రాష్ట్ర సెక్రెటరీ బుడిగే మల్లేష్ యాదవ్, సూర్యాపేట అసెంబ్లీ ఇంచార్జ్ వట్టే రేణుక యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో 18 వ వార్డు బలరాం తండా ఎల్ నవీన్ నాయక్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గత ఎన్నికల్లో జానయ్య వేయించిన ఓట్లను ఎందుకు వద్దనలేదనీ, జానయ్య ఎస్సీ హాస్టల్లో చేర్చిన 50 మంది విద్యార్థులను వెనక్కి పంపారన్నారు. విద్యార్థులతో కలిసి ఈ విషయమై త్వరలో విలేకరులకు సమావేశం నిర్వహిస్తాము అని తెలిపారు.
బహుజన ఆడపిల్లగా నేను ధైర్యంగా ముందుకు వచ్చాననీ గోడల చాటున భయపడాల్సిన పనిలేదనీ,ధైర్యంగా వచ్చి బహుజనుల రాజ్యాధికారం కోసం నాయకులు పోరాడాలి అని అన్నారు. రానున్నది సూర్యాపేటలో బహుజన రాజ్యమని గుర్తుపెట్టుకోవాలని, ఏ ఒక్కరికి భయపడాల్సిన పనిలేదని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ రాపోల్ నవీన్, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, పిడమర్తి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి దాసరి నవీన్, ఉపాధ్యక్షులు కొండ కిరణ్, గట్టు గోపి, మధుమహదేవ్, గుద్దేటి మధుసూదన్, ధరావత్ హుస్సేన్ నాయక్, నాగరాజు, 18వ వార్డు నుంచి వందమంది పార్టీలో చేరిన నాయకులు సాయిరాం నాయక్, రవి, శ్రీను, రాజకుమార్, రమేష్, సతీష్, కోటయ్య, పెద్దకోటయ్య, సంతోష్, విజయ్ ,రాహుల్, మస్తాన్, సాయి, గణేష్, శ్రవణ్, అజయ్, నరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.